ఏపీలో తెలుగుదేశం పార్టీ వేగంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా సరే..ఆ ఓటమి నుంచి త్వరగానే కోలుకుని టీడీపీ పికప్ అవుతుంది. పైగా వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత టిడిపికి ప్లస్ అవుతుంది. ఇదే క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీపై వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. ఈ సారి జిల్లాలో టిడిపి మెజారిటీ సీట్లు దక్కించుకునేలా ఉంది.

అందుకే ఈ జిల్లాలో సీట్లు కోసం తెలుగు తమ్ముళ్ళు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా గెలుపు ఖాయమని అనుకుంటున్న గుంటూరు వెస్ట్ సీటుపై తమ్ముళ్ళ ఫోకస్ ఎక్కువ ఉంది. ఈ సీటు కోసం ఓ వైపు ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర ట్రై చేస్తుండగా, మరోవైపు భాష్యం ప్రవీణ్, మన్నవ మోహన కృష్ణ లాంటి వారు కూడా వెస్ట్ సీటుపై ఆశలు పెట్టుకుంటున్నారు. అటు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సైతం వెస్ట్ సీటు తన వారసుడు రంగారావుకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.




అయితే పొత్తు ఉంటే ఈ సీటుని తీసుకోవాలని జనసేనకు చూస్తున్నట్లు తెలిసింది. ఇలా గుంటూరు వెస్ట్ పైనే ఫోకస్ పెట్టారు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వరుసగా టిడిపి గెలిచిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో టిడిపి తరుపున గెలిచిన మద్దాలి గిరి వైసీపీలోకి వెళ్లారు. అయినా సరే అక్కడ టిడిపికి బలం ఉంది. ఎవరు నిలబడిన అక్కడ ఈజీగా గెలిచేస్తారని భావిస్తున్నారు.

అందుకే ఈ సీటు కోసం పోటీ ఎక్కువ ఉంది. అయితే చంద్రబాబు ఇంతవరకు ఈ సీటుపై క్లారిటీ ఇవ్వలేదు. పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. చూడాలి మరి చివరికి ఈ సీటు ఎవరికి దక్కుతుందో.
