టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కువగా అసెంబ్లీ స్థానాలపైనే ఫోకస్ చేసి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడం ముఖ్యం కాబట్టి..అసెంబ్లీ స్థానాలపై ఎక్కువ ఫోకస్ చేశారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో వన్ టూ వన్ సమావేశమవుతూ..పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడుతున్నారు.అయితే ఎంపీ సీట్లపై కూడా బాబు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.

ఎంపీ సీట్లలో బలమైన నేతలు ఉంటే.ఆ ప్రభావం అసెంబ్లీ స్థానాలపై కూడా ఉంటుంది. దాని వల్ల టిడిపికి బెనిఫిట్ అవుతుంది. అయితే కొన్ని స్థానాల్లో పార్లమెంట్ స్థాయి నేతలు ఉన్నారు గాని..కొన్ని స్థానాలు ఇంకా ఖాళీ గా ఉన్నారు. ఎలాగో సిట్టింగ్ సీట్లు శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరుల్లో ఎంపీలు ఉన్నారు. ఇక కొన్ని సీట్లలో నేతలు ఉన్నారు. విజయనగరంలో అశోక్ గజపతి రాజు ఉండగా, విశాఖలో శ్రీ భరత్ ఉన్నారు. కానీ అనకాపల్లి, అరకు ఎంపీ స్థానాల్లో టిడిపికి నాయకులు లేరు. పార్లమెంట్ అధ్యక్షులు ఉన్నారు గాని..ఆ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు.

ఇటు ఉమ్మడి తూర్పు గోదావరిలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం సీట్లు ఖాళీ. అటు పశ్చిమ గోదావరిలో నరసాపురం, ఏలూరు స్థానాలు ఖాళీ. ఇక మచిలీపట్నం పార్లమెంట్ లో కొనకళ్ళ నారాయణ ఉన్నారు. అటు బాపట్ల, నరసారావుపేట, ఒంగోలు, నెల్లూరు స్థానాలు ఖాళీ. ఈ స్థానాల్లో టిడిపి ఎంపీ అభ్యర్ధులు లేరు.

చిత్తూరు, తిరుపతి, కడప సీట్లలో ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. అయితే రాజంపేటలో గంటా నరహరి, కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నంద్యాలలో మాండ్ర శివానంద రెడ్డి, అనంతపురంలో జేసి పవన్, హిందూపురంలో నిమ్మల కిష్టప్ప ఉన్నారు. మొత్తానికి పలు ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరి వీటిల్లో బలమైన నాయకుల్ని పెట్టడం కోసం చంద్రబాబు వెయిట్ చేస్తున్నారేమో.
