
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మదనపల్లి సీటీఎం దగ్గర నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మదనపల్లి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మదనపల్లి సీటీఎం దగ్గర నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మదనపల్లి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. కాగా.. ఆయన నేడు చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. పవర్ లూమ్ 500 యూనిట్స్ విద్యుత్ ఎత్తేశారని.. వైఎస్సార్ బీమా ఏం చేశారని ప్రశ్నించారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సబ్సిడీ ఏం చేశారని ప్రశ్నించారు. సబ్సిడీ ఏం చేశారని ప్రశ్నించారు. 63 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టించు కోలేదని నారా లోకేష్ విమర్శించారు. చేనేత కార్మికులకు గుర్తింపులు లేవని.. బీసీ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. రాజకీయంగా వాడుకుంటున్నారని.. వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారన్నారు. రియల్ టైం టెక్నాలజీతో ఆదుకుంటానన్నారు. G+3 ఇళ్లు, మగ్గాలకు ప్రత్యేక సదుపాయం కల్పించాలన్నారు. పింఛన్లు ఎత్తేశారని.. జీఎస్టీతో నేతన్నలు ఇబ్బంది పడుతున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు.
