ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం…టిడిపి కంచుకోట. చింతమనేని ప్రభాకర్ అడ్డా అని చెప్పవచ్చు. అలా టిడిపి కంచుకోటగా ఉన్న దెందులూరుని గత ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకుంది. ఎన్‌ఆర్‌ఐ గా వచ్చిన అబ్బయ్య చౌదరీ వైసీపీ నుంచి నిలబడి చింతమనేనిపై గెలిచారు. అయితే చింతమనేనికి ఉన్న గొడవలని వైసీపీ పెద్దగా చేసి చూపించి..చింతమనేనికి నెగిటివ్ చేశారు. దీని వల్ల అబ్బయ్య గెలిచారు.


అయితే గెలిచిన కొన్ని రోజుల్లోనే అబ్బయ్యకు యాంటీ మొదలైంది. ఇటు చింతమనేని దూకుడుగా పనిచేస్తూ..టిడిపి బలం పెంచుతూ వచ్చారు. ఈ దెబ్బతో దెందులూరులో రాజకీయం మారిపోయింది. ఇటీవల సర్వేల్లో దెందులూరులో టిడిపికి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిసింది. దీంతో అబ్బయ్య రూట్ మార్చారు..కమ్మ వర్గానికి చెందిన ఈయన..చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. వారిని తిడితే వైసీపీలో ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు.


కేవలం పోలీసులని, ప్రభుత్వాన్ని తిట్టడానికే చంద్రబాబు, లోకేశ్‌లు యాత్రలు చేస్తున్నారని తాజాగా అబ్బయ్య ఫైర్ అయ్యారు. తెలుగుదేశం హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం లోకేష్‌కు ఉందా? అని అబ్బయ్య ప్రశ్నించారు. అయితే ఇలా విమర్శలు సంధించడం వల్ల కాస్త తన మైలేజ్ పెరుగుతుందని అబ్బయ్య భావిస్తున్నారు.

కానీ దెందులూరులో సీన్ మారిపోయింది..టిడిపి లీడ్ లో కనిపిస్తుంది. కాబట్టి దెందులూరులో అబ్బయ్య ఎంత కష్టపడిన మళ్ళీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తానికి దెందులూరులో చింతమనేని హవా కనిపిస్తుంది.
