ఏపీలో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నామని మొన్నటివరకు హడావిడి చేసిన బిజేపి నేతలు ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుకుంటుంది. ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు, జివిఎల్ లాంటి వారు జగన్‌కు అనుకూలంగా నడుస్తున్నారని, వారే టిడిపితో పొత్తుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని బిజేపిలో కొందరు నేతలు రగిలిపోతున్నారు. అలాగే ఉంటే ఇంకా కష్టమే అని చెప్పి..వారు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు.


గత ఎన్నికల్లో బిజేపికి ఒక్కశాతం ఓట్లు కూడా రాలేదు. బిజేపి నుంచి పోటీ చేసిన వారంతా డిపాజిట్ కోల్పోయారు. కాకపోతే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడంతో ఏపీలో కాస్త బిజేపి నేతలు హడావిడి చేశారు. టిడిపి నుంచి కొందరు నేతలని బిజేపిలో చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పరిస్తితులు మారుతున్నాయి. మొన్నటివరకు టిడిపితో పొత్తు ఉంటుందేమో దాంతో మూడు, నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు అని కొందరు బిజేపి నేతలు ఆశలు పెట్టుకున్నారు.

కానీ సోము, జివిఎల్ లాంటి వారు మాత్రం టిడిపితో పొత్తు లేదనే చెప్పేస్తున్నారు. దీంతో పొత్తు లేదని తేలిపోయింది. ఈ క్రమంలోనే వారి వైఖరి నచ్చక కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు బిజేపిని వదిలి టిడిపిలో చేరారు. అంతకముందు రావెల కిషోర్ బాబు బిఆర్‌ఎస్ లో చేరారు. ఇంకా ఇప్పుడు కొందరు కీలక నేతలు టిడిపిలో చేరడానికి సిద్ధమవుతున్నారు.

టిడిపితో పొత్తు లేకపోవడం వైసీపీతో అంటకాగడంతో కొందరు బిజేపి నేతలు జంపింగుకు రెడీ అవుతున్నారు. అలాగే బిజేపి పొత్తు నుంచి బయటకు రావడానికి పవన్‌కు కూడా మంచి అవకాశం దొరికింది. వైసీపీకి పరోక్షంగా సపోర్ట్ ఇస్తున్న బిజేపిని పవన్ సైతం వదిలించుకునే ఛాన్స్ ఉంది.
