రాయలసీమలో తెలుగుదేశం పార్టీ వీక్ గా ఉందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. ఒక ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా..మిగిలిన కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ బలం తక్కువ..ఈ మూడు జిల్లాల్లో వైసీపీ హవా ఉంది. గత ఎన్నికల్లో నాలుగు జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది. సీమ మొత్తం 52 సీట్లు ఉంటే అందులో 49 వైసీపీ గెలుచుకోగా, టీడీపీ 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

అంటే వైసీపీ హవా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సారి సీమలో వైసీపీ హవా తగ్గించి టీడీపీ సత్తా చాటాలని చూస్తుంది. అయితే కొంతమేర వైసీపీ బలం తగ్గింది గాని..ఇప్పటికీ సీమలో లీడింగ్ వైసీపీదే. అందుకే లోకేష్ పాదయాత్ర కూడా ఎక్కువ రోజులు, ఎక్కువ స్థానాలు సీమలో పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. చిత్తూరు జిల్లాలో 14 సీట్లు ఉంటే..14 సీట్లలో లోకేష్ పాదయాత్ర ఉండనుంది. అటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 14 సీట్లు చొప్పున ఉన్నాయి..ఆ జిల్లాల్లో 12 సీట్లలో లోకేష్ పాదయాత్ర జరగనుంది. అంటే ఒకో జిల్లాలో 12 సీట్లలో పాదయాత్ర ఉంటుంది.

కడపలో 10 సీట్లు ఉంటే 7 సీట్లలో పాదయాత్ర ఉండనుంది..ఇలా సీమలో ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్ర ప్రభావం వల్ల సీమలో టీడీపీ బలం ఏమన్నా పెరుగుతుందేమో చూడాలి.

Leave feedback about this