రాష్ట్రంలో రిజర్వడ్ స్థానాల్లో అధికార వైసీపీకి బలం ఎక్కువనే చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు వైసీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. మొదట నుంచి వారు కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైఎస్సార్‌పై అభిమానంతో వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో టిడిపి హవా ఉన్న 2014 ఎన్నికల్లో కూడా రిజర్వ్ స్థానాల్లో వైసీపీ హవా నడిచింది. ఇక 2019 ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ ఆధిక్యం సాధించింది. 29 ఎస్సీ స్థానాల్లో 27, 7 ఎస్టీ స్థానాల్లో 7 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అంటే వైసీపీ హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే అధికారంలోకి వచ్చాక అదే ఎస్సీ, ఎస్టీలకు వైసీపీ ఏం చేసిందనేది వారికే క్లారిటీ ఉండాలి. కాకపొతే కొద్దిగా ఎస్సీ స్థానాల్లో మార్పు కనిపిస్తుంది. పూర్తిగా కాకపోయిన కొన్ని స్థానాల్లో టిడిపికి పట్టు పెరుగుతుంది. కానీ ఎస్టీ స్థానాల్లో వైసీపీ బలం అలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ స్థానాల్లో టిడిపి పుంజుకున్నట్లే కనిపించడం లేదు. అరకు, పాడేరు, రంపచోడవరం, పాలకొండ, సాలూరు, కురుపాం, పోలవరం సీట్లు ఎస్టీ రిజర్వ్. గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలని వైసీపీ గెలుచుకుంది.

అయితే ఇప్పుడు ఆ స్థానాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్ద పాజిటివ్ లేదు. అలా అని టిడిపికి కూడా పాజిటివ్ లేదు. కాకపొతే అక్కడి ప్రజలకు వైఎస్సార్ పై అభిమానం ఉంది..దీంతో జగన్‌కు సపోర్ట్ గా ఉంటున్నారు. పైగా జగన్ అందిస్తున్న పథకాలు ఎస్టీ స్థానాల్లో ప్రజలకు అండగా ఉంటున్నాయి. దీంతో వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. అంటే ఎమ్మెల్యేలకు పాజిటివ్ లేకపోయినా పార్టీ పరంగా వైసీపీకి ఎడ్జ్ ఉంది.

కొద్దో గొప్పో ఒక్క పోలవరంలో టిడిపికి కాస్త పాజిటివ్ కనిపిస్తుంది. మరి ఎన్నికల సమయానికి ఇంకా కొన్ని స్థానాలపై పట్టు సాధిస్తుందో..లేక పూర్తిగా కోల్పోతుందో చూడాలి.
