2019 ఎన్నికల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో టిడిపికి నిలకడైన నాయకుడు దొరకడం లేదు. ఎప్పటికప్పుడు నాయకులు మారుతూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టిడిపి తరుపున శిద్ధా రాఘవరావు పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో శిద్ధా ఒంగోలు ఎంపీగా పోటీ చేయగా, దర్శి నుంచి బాలయ్య ఫ్రెండ్ కదిరి బాబూరావు పోటీ చేశారు. ఇద్దరు నేతలు ఓడిపోయారు. ఓడిపోయాక శిద్ధా టిడిపిని వదిలి వైసీపీలోకి వెళ్లారు.

ఆ వెంటనే కదిరి సైతం టిడిపిని వదిలి వైసీపీలోకి వెళ్లారు. దీంతో దర్శిలో టిడిపి నాయకుడు లేరు. ఈ క్రమంలోనే పమిడి రమేష్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన ఎఫెక్టివ్ గా పనిచేస్తూ..దర్శిలో పార్టీని యాక్టివ్ చేశారు. దర్శి మున్సిపాలిటీలో టిడిపి గెలుపుకు కృషి చేశారు. ఇలా పార్టీని బలోపేతం చేస్తున్న తరుణంలో రమేష్ కు సీటు విషయంలో క్లారిటీ లేదు. దీంతో ఆయన ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు దర్శి టిడిపికి నాయకుడు లేరు.

అయితే కావాలని నాయకుడుని పెట్టడం లేదా? కీలక నాయకుడుని వెతికే పనిలో టిడిపి అధిష్టానం ఉందా? అనే అంశంపై క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారం ఉంది. దర్శిలో జనసేనకు చెప్పుకోదగ్గ బలం ఉంది..కానీ టిడిపి ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. అలాంటప్పుడు సీటు జనసేనకు ఎలా ఇస్తారనే ప్రశ్నలు దర్శి టిడిపి శ్రేణుల నుంచి వస్తుంది.

ఆల్రెడీ జనసేన శ్రేణులు ఏమో పొత్తులో భాగంగా దర్శి సీటు తమకే వస్తుందని ప్రచారం చేస్తుందట. ఇలా దర్శి సీటు విషయంలో క్లారిటీ లేదు. చివరికి దర్శి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.