ఏపీ రాజకీయా సమీకరణాలు ఊహించని విధంగా మారుతూ వెళుతున్నాయి. అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టిడిపి బలపడుతుంది. అదే సమయంలో జనసేనతో పొత్తుపై కన్ఫ్యూజన్ ఉంది. టిడిపి-జనసేన కలిసి పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం ఎప్పటినుంచో వస్తుంది. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు-పవన్ కల్యాణ్ రెండుసార్లు కలిశారు. దీంతో పొత్తు ఖాయమని ప్రచారం మొదలైంది.

కానీ పొత్తు విషయం తెగడం లేదు. ఓ వైపు జనసేన బిజేపితో కలిసి ఉంది. బిజేపి ఏమో టిడిపితో కలిసే ప్రసక్తి లేదని అంటుంది. ఈ క్రమంలోనే టిడిపి సోలోగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు జనసేన ఏమో పలు డిమాండ్లు పెడుతుంది..పవన్‌కు సిఎం సీటు అంటుంది…సీట్ల విషయంలో డిమాండ్లు ఉన్నాయి. దీంతో ఎన్నికల ముందు పరిస్తితులని పొత్తు గురించి ఆలోచించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈలోపు సింగిల్ గా బలపడేలా బాబు ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే జనసేన వైపు వెళ్లాల్సిన రాజేష్ మహాసేనని సైతం టిడిపి వైపుకు తిప్పారు. దళిత వర్గానికి చెందిన రాజేష్..దళితుల కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల ముందు వైసీపీ కోసం పనిచేసిన రాజేష్..వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఆ పార్టీ తప్పులని ప్రశ్నిస్తూ..ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ఇదే సమయంలో ఇటీవల జనసేన వైపు వెళ్లారు. కానీ జనసేన మాత్రం రాజేష్‌ని పట్టించుకోలేదని తెలిసింది.

దీంతో రాజేష్ మహాసేన జనసేనలో చేరకుండా..టిడిపిలో చేరడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన తూర్పు గోదావరి టిడిపి నేతలతో భేటీ అయ్యారు. ఈ నెల 15న చంద్రబాబు తూర్పు గోదావరి లో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే రాజేష్..చంద్రబాబు సమక్షంలో ఈ నెల 16న టిడిపిలో చేరనున్నారు. అయితే ఇలా రాజేశ్ టిడిపిలో చేరడంపై జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఇలా మాట నిలబడని వారు జనసేనకు అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు.
