ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చెప్పవచ్చు..ఈ జిల్లాలో చాలా స్థానాలు టిడిపికి కంచుకోటలుగా ఉన్నాయి. అలా టిడిపికి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో తణుకు కూడా ఒకటి. ఇక్కడ 1985 నుంచి టిడిపి హవా నడుస్తుంది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయింది. 2014 లో మళ్ళీ టిడిపి గెలిచింది.
అయితే 2019 ఎన్నికల్లో మళ్ళీ పార్టీ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ జనసేన ఓట్లు చీల్చడం వల్ల తనుకులో టిడిపి ఓడిపోయింది. టిడిపి నుంచి అరిమిల్లి రాధాకృష్ణ కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు గెలిచారు. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. తణుకులో టిడిపి హవా పెరుగుతుంది. నిత్యం ప్రజల్లో ఉంటున్న అరిమిల్లి బలం పెరిగింది.

మంత్రిగా ఉన్నా సరే కారుమూరిపై నెగిటివ్ ఎక్కువ ఉంది. మంత్రిగా ఉన్నా సరే నియోజకవర్గానికి చేసేదేమీ లేదు. అరిమిల్లి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనుకులో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు వాటినే తణుకు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
ఈ సారి అరిమిల్లి వైపుకు రావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఓడిపోయిన దగ్గర నుంచి అరిమిల్లి ప్రజల్లోనే ఉంటున్నారు. టీడీపీని మరింత బలోపేతం చేస్తున్నారు. ప్రతి గడపని టచ్ చేసేలా అరిమిల్లి ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇటీవల జోన్ సమావేశాల్లో చంద్రబాబు సైతం..తణుకు లో దూసుకెళుతున్నారని చెప్పుకొచ్చారు. ఇదే ఊపు కొనసాగితే తణుకులో ఈ సారి అరిమిల్లి విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పవచ్చు.
