తెలుగుదేశం పార్టీని గాడిలో పెట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే..అధికార బలంతో ఉన్న వైసీపీకి చెక్ పెట్టి, ఆ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఓ వైపు నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్‌లతో సమావేశమవుతూ, వారికి దిశానిర్దేశం చేస్తూ..మరోవైపు జిల్లాల పర్యటన చేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళుతున్నారు.

ఇప్పటికే వరుసపెట్టి పలు జిల్లాల్లో పర్యటించారు..ఇక బాబు పర్యటనలకు జనం నుంచి కూడా భారీ స్పందన వస్తుంది. దీంతో టీడీపీలో కొత్త ఉత్సాహం వస్తుంది. బాబు పర్యటించే నియోజకవర్గాల్లో టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇదే క్రమంలో బాబు ఈ నెల 22 నుంచి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గజపతినగరం, బొబ్బిలి, రాజాం నియోజకవర్గాల్లో బాబు రోడ్ షోలు, భారీ సభలు నిర్వహించనున్నారు. అయితే బాబు పర్యటనని విజయవంతం చేసేందుకు ఆయన స్థానాల టీడీపీ నేతలు కష్టపడుతున్నారు. ఇక బాబు పర్యటనతో ఆయా స్థానాల్లో టీడీపీకి అడ్వాంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది.

పైగా గత ఎన్నికల్లో ఈ మూడు స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. బొబ్బిలి, రాజాం స్థానాల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. అయితే ఈ సారి ఖచ్చితంగా గెలవాలని చెప్పి బాబు..నేతలకు టార్గెట్ ఇచ్చారు. నేతలు కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. అయితే వీటిల్లో కొద్దో గొప్పో బొబ్బిలిలో టీడీపీ బలం పెరిగింది. ఇక్కడ టీడీపీ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ గజపతినగరంలో కాస్త డౌట్ అనే పరిస్తితి.

ఇక్కడ ఇంచార్జ్ గా కేఏ నాయుడు ఉన్నారు..ఈయన బలం పెద్దగా పెరిగినట్లు లేదు. పైగా అపోజిట్ లో బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పలనరసయ్య ఉన్నారు. ఇక్కడ బొత్స ఫ్యామిలీకి పట్టు ఎక్కువ ఉంది. అందుకే ఇక్కడ టీడీపీకి ఛాన్స్ రావట్లేదు. అటు రాజాంలో కూడా టీడీపీ వీక్ గానే కనిపిస్తోంది. మరి బాబు పర్యటనలతో ఆయా స్థానాల్లో టీడీపీ రాత మారుతుందేమో చూడాలి.

Leave feedback about this