వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపు గుర్రాల అవసరం ఎక్కువ ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో వేవ్ లో వైసీపీ నుంచి పోటీ చేసి 150 మంది గెలిచేశారు. కానీ ఈ సారి జగన్ వేవ్ ఉండటం కష్టం..అలాగే చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అటు టిడిపి బలపడుతుంది..అదే తరుణంలో టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి తిప్పలు తప్పవు. అందుకే వైసీపీలో గెలుపు గుర్రాలు కావాలి. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎన్నికల్లో సిఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది.

సొంత ఇమేజ్ తో జగన్ సతీమణి పక్కాగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇంతవరకు భారతి రాజకీయాల వైపుకు రాలేదు. పరోక్షమంగా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారేమో క్లారిటీ లేదు గాని..ప్రత్యక్షంగా రాజకీయాల జోలికి వచ్చింది తక్కువే. కానీ ఇప్పటికే జగన్ సోదరి వైఎస్ షర్మిల..తెలంగాణలో పార్టీ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇటు విజయమ్మ సైతం షర్మిలకు మద్ధతుగా అటు వెళ్ళిపోయారు.

దీంతో వైఎస్ ఫ్యామిలీ నుంచి పోటీ చేసే వాళ్ళు కనబడటం లేదు. జగన్ ఎలాగో పులివెందుల బరిలో ఉంటారు..అటు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారు. ఇదే క్రమంలో భారతి కూడా పోటీ చేస్తే పార్టీకి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారట. ఈ క్రమంలోనే భారతి జమ్మలమడుగులో పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది.

ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి ఉన్నారు..ఆయన పనితీరు పెద్దగా బాగున్నట్లు కనిపించడం లేదు. ఇదే క్రమంలో బిజేపిలో ఉన్న ఆదినారాయణ రెడ్డి టిడిపిలోకి వచ్చి పోటీ చేస్తే సుధీర్‌కు రిస్క్ తప్పదని తెలుస్తోంది. అందుకే సుధీర్ ని పక్కన పెట్టి భారతి పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది. అలాగే అక్కడే ఉన్న రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని టాక్. చూడాలి మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో.


