తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను గత నాలుగు దశాబ్దాలుగా నడిపిస్తూ వస్తున్నారు. తుమ్మల రాజకీయాలను ఎప్పుడు శాసించలేదు.. ఒకరిని శాసించాలనుకునే మనస్తత్వం ఆయనది కాదు. అలాగే ఆయనకు పదవులు ఏనాడు అలంకారం కాలేదు. పదవులే ఆయన వెంట పరిగెడుతూ వచ్చాయి. తుమ్మల ఏనాడు అధికారం పదవుల కోసం పాకులాడలేదు. ఎప్పుడు నా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి, ప్రజలు అన్న నినాదమే ఆయన నోటి వెంట వినిపించేది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తుమ్మల ఖమ్మం నుంచి 11వ సారి అసెంబ్లీకి పోటీ పడుతున్నారు.

40 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో చిన్న మచ్చ కూడా లేని తుమ్మల లాంటి నేత తొలిసారిగా జాతీయ పార్టీ నుంచి ఎన్నికల రణక్షేత్రంలో నుంచున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహరి పోరు నడుస్తోంది. ఈ టైంలో ఖమ్మం, అసెంబ్లీ సెగ్మెంట్ పోరు రెండు పార్టీల మధ్య హోరాహోరీగా ఉండడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు అయితే తుమ్మల కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడో.. ఆ ప్రభావం మామూలుగా లేదని చెప్పాలి.
తుమ్మలకు ఆ పార్టీ, ఈ పార్టీ.. ఆ కులం, ఈ మతం అని తేడా లేకుండా అన్నిచోట్ల అభిమానులు ఉన్నారు. నాలుగు దశాబ్దాలలో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆ స్థాయిలో అభివృద్ధి చేశారు. తుమ్మల ఎప్పుడు అయితే కాంగ్రెస్లోకి వచ్చారో ఖమ్మం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. కేవలం నెల రోజుల్లోనే దశ దిశ లేని స్థాయి నుంచి భారీ గెలుపు దిశగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఎన్నికలకు 20 రోజుల ముందే ఇలాంటి ప్రభావం ఉంటే రేపటి ఎన్నికలలో తుమ్మల గెలుపు అలా ఇలా ఉండేలా లేదు.

వలం ఖమ్మం నియోజకవర్గంలో మాత్రమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకచోట కూడా కాంగ్రెస్కు బలమైన అభ్యర్థి లేడు అంటూ రాష్ట్రంలో అధికార పక్షం నేతలు ఎద్దేవా చేశారు. తుమ్మల ఇప్పుడు అయితే కాంగ్రెస్లోకి అలా ఎంటర్ అయ్యాడో ఈరోజు జిల్లాలో టిఆర్ఎస్ ఒక్క సీటు అయిన గెలుస్తుందా ? అన్న స్థాయికి ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు దిగజారుతూ వస్తోంది. దీనిని బట్టే తుమ్మల కాంగ్రెస్ ఎంతలా ప్లస్ అయ్యాడో తెలుస్తోంది.