తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గం ఖమ్మం జిల్లాలోని పాలేరు. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆ పార్టీ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావును ఓడించి రాష్ట్రంలోనే తిరుగులేని జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. నిజం చెప్పాలంటే ఉపేందర్ రెడ్డికి 2018 ఎన్నికలు తొలి ఎన్నికలు.
తుమ్మలతో పోల్చుకుంటే అంత రాజకీయ అనుభవం లేకపోయినా తనదైన రాజకీయ చరిత్రతో పాటు లోకల్ నినాదంతో తుమ్మలను మట్టి కరిపించారు. అనంతరం లోక్‌సభ ఎన్నికలకు ముందే ఉపేందర్ రెడ్డి గులాబీ పార్టీలో చేరిపోయారు. లోక్‌సభ ఎన్నికలలో ఎంపీ నామా నాగేశ్వరరావుకు పాలేరు సెగ్మెంట్ నుంచి భారీ మెజార్టీ రావడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలు.. సీఎం కేసీఆర్ చొరవతో పాలేరు నియోజకవర్గంలో దాదాపు ఒక మంత్రి స్థాయిలో అభివృద్ధి పనులు చేసి చూపించారు.
అక్కడి వరకు బాగానే ఉంది. నిన్న మొన్నటి వరకు పాలేరులో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి నాథుడే లేడు. చివరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక బీఆర్ఎస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్న నాన్ లోకల్ క్యాండెట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేర్చుకుని ఇక్కడ పోటీకి పెట్టారు. రాజకీయాల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు.. గెలుపు ఓటములు అనేవి సహజం.. కానీ పొంగులేటి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఏ ఒక్క అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనూ అంటూ సినిమా స్టైల్ డైలాగ్ చెప్పారు.
ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో రెండు మూడు సార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వాడెవ్వరో బీఆర్ఎస్ అభ్యర్థులను గేటు కూడా తాకనివ్వను అంటున్నడు… చూద్దాం అంటూ పరోక్షంగా పొంగులేటికి చురకలు కూడా అంటించారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి పాలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి మీదే ఉంది

నాడు తుమ్మలను ఓడించి రాష్ట్రస్థాయాలో ఆయన సంచలనం అయ్యారు. ఇప్పుడు ఏ కేసీఆర్‌ను అయితే సవాల్ చేశాడో అదే పొంగులేటిని ఓడిస్తే మళ్లీ ఉపేందర్ రెడ్డి మళ్లీ జెయింట్ కిల్లర్ అవుతారనడంలో సందేహం లేదు. ఉపేందర్ రెడ్డి పొంగులేటిని కనుక అసెంబ్లీ గేటు దాటనీయకుండా చేయడంలో ఎలా సక్సెస్ అవుతారనేది ఎన్నికల ఫలితాల్లో తేలిపోనుంది.
తుమ్మలతో పోల్చుకుంటే అంత రాజకీయ అనుభవం లేకపోయినా తనదైన రాజకీయ చరిత్రతో పాటు లోకల్ నినాదంతో తుమ్మలను మట్టి కరిపించారు. అనంతరం లోక్‌సభ ఎన్నికలకు ముందే ఉపేందర్ రెడ్డి గులాబీ పార్టీలో చేరిపోయారు. లోక్‌సభ ఎన్నికలలో ఎంపీ నామా నాగేశ్వరరావుకు పాలేరు సెగ్మెంట్ నుంచి భారీ మెజార్టీ రావడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలు.. సీఎం కేసీఆర్ చొరవతో పాలేరు నియోజకవర్గంలో దాదాపు ఒక మంత్రి స్థాయిలో అభివృద్ధి పనులు చేసి చూపించారు.
అక్కడి వరకు బాగానే ఉంది. నిన్న మొన్నటి వరకు పాలేరులో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి నాథుడే లేడు. చివరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక బీఆర్ఎస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్న నాన్ లోకల్ క్యాండెట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేర్చుకుని ఇక్కడ పోటీకి పెట్టారు. రాజకీయాల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు.. గెలుపు ఓటములు అనేవి సహజం.. కానీ పొంగులేటి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఏ ఒక్క అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనూ అంటూ సినిమా స్టైల్ డైలాగ్ చెప్పారు.

ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో రెండు మూడు సార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వాడెవ్వరో బీఆర్ఎస్ అభ్యర్థులను గేటు కూడా తాకనివ్వను అంటున్నడు… చూద్దాం అంటూ పరోక్షంగా పొంగులేటికి చురకలు కూడా అంటించారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి పాలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి మీదే ఉంది. నాడు తుమ్మలను ఓడించి రాష్ట్రస్థాయాలో ఆయన సంచలనం అయ్యారు. ఇప్పుడు ఏ కేసీఆర్‌ను అయితే సవాల్ చేశాడో అదే పొంగులేటిని ఓడిస్తే మళ్లీ ఉపేందర్ రెడ్డి మళ్లీ జెయింట్ కిల్లర్ అవుతారనడంలో సందేహం లేదు. ఉపేందర్ రెడ్డి పొంగులేటిని కనుక అసెంబ్లీ గేటు దాటనీయకుండా చేయడంలో ఎలా సక్సెస్ అవుతారనేది ఎన్నికల ఫలితాల్లో తేలిపోనుంది.