యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ జనాల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ఎక్కడకక్కడ లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అలాగే లోకేష్ ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. అయితే పాదయాత్ర ద్వారా లోకేష్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి దూరమైన వర్గాలని మళ్ళీ దగ్గర చేసుకునేలా లోకేష్ ముందుకెళుతున్నారు.

ప్రధానంగా యువత, మహిళ ఓటర్లని లోకేష్ టార్గెట్ చేశారు..వారి సమస్యలనే ప్రధానంగా తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. ఎక్కడకక్కడ సమావేశాలు పెడుతూ.వారితో సమావేశమవుతూ..వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలని పరిష్కరిస్తామని చెబుతూ ముందుకెళుతున్నారు. అదేవిధంగా బీసీ వర్గంపై కూడా ఫోకస్ పెట్టారు. బీసీల్లో కులాల వారీగా సమావేశాలు పెడుతూ..వారి సమస్యలని సైతం తెలుసుకుంటున్నారు. అయితే మొదట నుంచి బీసీలు టిడిపికి అనుకూలం. కానీ గత ఎన్నికల్లో వారు వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో మళ్ళీ బిసి వర్గాలని దగ్గర చేసుకోవడమే లక్ష్యంగా లోకేష్ ముందుకెళుతున్నారు.

బీసీల ఓట్లు మెజారిటీ సంఖ్యలో దక్కించుకుంటే టిడిపికి ప్లస్ అవుతుంది. అటు యువత ఓట్లు ప్రధానమని చెప్పవచ్చు. కొత్తగా నమోదయ్యే ఓట్లు యువతవే. వారు ఎక్కువగా వైసీపీ, జనసేనల వైపు మొగ్గు చూపుతున్నారు. టిడిపిలో ఆకట్టుకునే యువ నాయకత్వం లేకపోవడం వల్ల ఈ పరిస్తితి వచ్చింది. ఇప్పుడు లోకేష్ యువతని ఆకట్టుకునేలా ముందుకెళుతున్నారు. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకునేలా లోకేష్ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ-ఎస్టీ వర్గాలని సైతం టిడిపి వైపుకు తిప్పుకునేలా లోకేష్ వ్యూహాత్మకంగా వెళుతున్నారు. మొత్తానికి పాదయాత్ర ద్వారా టిడిపికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా పనిచేస్తున్నారు.
