లోకేష్ పాదయాత్ర అంశంలో వైసీపీ వైఖరి చాలా వింతగా కనిపిస్తుంది. ఓ వైపు పాదయాత్రలో అసలు ప్రజలే లేరు అని, పాదయాత్ర ఫెయిల్ అయిందని చెబుతూనే..లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలు పాదయాత్ర సక్సెస్ కాదని చెబుతున్నప్పుడు లోకేష్‌ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండదు. పాదయాత్ర ఫెయిల్ కాబట్టి..ఆయనని వదిలేయొచ్చు. కానీ వైసీపీ నేతల అలా చేయడం లేదు. లోకేష్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.

తాజాగ్ వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సైతం..వైసీపీ పంథాలో తిట్టడం మొదలుపెట్టారు. నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని, పాదయాత్ర చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కాదు కదా.. రెండు మూడు సీట్లు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని అన్నారు. అలా బైరెడ్డి తన నోటికి పనిచెప్పారు. ఇంకా చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే రాజకీయాల్లో ఓనమాలు తెలియని బైరెడ్డి..బాబు-లోకేష్ లపై విమర్శలు చేయడం పెద్ద కామెడిగా ఉందని..ఏదో పదవి నిలుపుకోవడం కోసం, సీటు కోసం బైరెడ్డి..ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం విమర్శలు చేశారని టిడిపి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

అసలు ప్రజా మద్ధతు మొత్తం జగన్‌కు ఉన్నప్పుడు బాబు, లోకేష్ లని విమర్శించాలని పని ఉండదు అని, ఇంకా పాదయాత్ర సక్సెస్ కాలేదని అనుకుంటునప్పుడు విమర్శలు చేయడం దేనికి అంటున్నారు. పాదయాత్ర సక్సెస్ అయింది కాబట్టే బైరెడ్డి పనిగట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని విమర్శలు చేశారని, ఇక వైసీపీ గ్రాఫ్ డౌన్ అవ్వడంతోనే బైరెడ్డి..జగన్‌కు జాకీలు వేసే లేపే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరెన్ని చేసిన వైసీపీ ఓటమిని ఆపలేరని అంటున్నారు.
