June 10, 2023
ap news latest AP Politics

రాయపాటి వారసుడుకు సీటు దక్కుతుందా?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు..వచ్చే ఎన్నికల్లో పోటీ చేయట్లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై తాను పోటీకి దూరంగా ఉంటానని చెప్పారు. అలాగే తన వారసుడుకు సీటు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు ఏ సీటు ఇస్తే ఆ సీటులో తన కుమారుడు పోటీ చేస్తారని చెప్పారు. అయితే రాయపాటి గత రెండు ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా పోటీ చేశారు. అంతకముందు కాంగ్రెస్ తరుపున పలుమార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచిన రాయపాటి, 2014లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తన వారసుడుకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే నరసారావుపేట ఎంపీ సీటుని పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు మహేశ్‌కు ఇస్తారనే ప్రచారం వస్తుంది. అది జరగని పక్షంలో వైసీపీ నుంచి వచ్చే ఓ నేతకు ఆ సీటు ఇస్తారని అంటున్నారు. అంటే నరసారావుపేట ఎంపీ సీటు దక్కడం కష్టం. అయితే రాయపాటి..సత్తెనపల్లి గాని, గుంటూరు వెస్ట్ గాని అడుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆ రెండు సీట్లు కూడా దక్కే అవకాశాలు లేవు..సత్తెనపల్లి పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని ప్రచారం ఉంది. అటు గుంటూరు వెస్ట్ కోసం పోటీ ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో రాయపాటి వారసుడుకు ఏ సీటు దక్కుతుందనేది క్లారిటీ లేదు. అలాగే సీటుపై గ్యారెంటీ లేదు. చూడాలి మరి రాయపాటి వారసుడుకు సీటు దక్కుతుందో? లేదో?

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video