Site icon Neti Telugu

విశాఖలో బీఆర్ఎస్ సభ..కేసీఆర్ టార్గెట్ అదే!

భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పాలని చూస్తున్న విషయం తెల్సిందే. ఈ సారి కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అలాగే జాతీయ స్థాయిలో బి‌ఆర్‌ఎస్ బలం పెంచాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ముందుగా తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో పార్టీని బలపర్చాలని చూస్తున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు.

ఇందులో ఎక్కువగా ఏపీపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొందరు నేతలని పార్టీలో చేర్చుకున్నారు. అలాగే ఏపీ బి‌ఆర్‌ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ని నియమించారు. అయితే ఏపీలో పార్టీ బలం పెంచడానికి కేసీఆర్ కొత్త ఎత్తులతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ తొలి ఆవిర్భావ సభ పెట్టిన విషయం తెలిసిందే. ఇక త్వరలో ఏపీలో బి‌ఆర్‌ఎస్ సభకు ప్లాన్ చేస్తున్నారు. విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఉండబోతుందని తోట చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ సభకు సంబంధించిన తేదీని ఖరారు చేస్తామని,  సీఎం కేసీఆర్ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తారని అన్నారు.

అంటే త్వరలో ఏపీలో కేసీఆర్ ఎంట్రీ ఉండనుంది. అయితే విశాఖలో సభ ఏర్పాటు చేయడానికి కారణాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో కేసీఆర్ సొంత సామాజికవర్గం వెలమలు అక్కడ ఎక్కువ గా ఉన్నారు. పైగా కేసీఆర్ పూర్వీకులుది ఉత్తరాంధ్ర అనే ప్రచారం కూడా ఉంది. ఇక ఈ సభలో భారీ ఎత్తున నేతలని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకొస్తారని ప్రచారం ఉంది. ముఖ్యంగా టీడీపీ-జనసేన నేతలనే టార్గెట్ చేసి కేసీఆర్ ముందుకెళ్తారని, ఆ పార్టీల్లో ఖాళీగా ఉన్న నాయకులని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకొస్తారనే ప్రచారం ఉంది. అయితే ఏపీలో కేసీఆర్ ఎత్తులు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. 

Exit mobile version