కృష్ణా జిల్లాలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు మంత్రులుగా ఉన్న, ఎమ్మెల్యేలుగా ఉన్నా సరే తమ సొంత నియోజకవర్గానికి ఏమి చేస్తున్నారో తెలియదు గాని..జగన్‌ని విమర్శించిన వారిపై మాత్రం విరుచుకుపడటం చేస్తుంటారు. అసలు మంత్రులుగా ఉన్నప్పుడు వీరు తమ శాఖలకు సంబంధించిన పనులు ఏం చేశారో ఎవరికి క్లారిటీ లేదు.


కానీ చంద్రబాబు, పవన్, లోకేష్‌లని మాత్రం ఎప్పుడు తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అయితే ఇలా తిట్టడం వల్ల చంద్రబాబు, పవన్‌లకు వచ్చిన నష్టమేమీ లేదు గాని..స్వతహాగా వారికి ఉన్న ఇమేజ్ మాత్రం తగ్గినట్లే కనిపిస్తుంది. పైగా వీరి సొంత స్థానాల్లో టీడీపీని అణిచి వేసే కార్యక్రమాలు చేయడం ఇంకా మైనస్‌గా మారింది. పేర్ని నాని బందరులో, కొడాలి నాని గుడివాడలో టీడీపీని దెబ్బతీసే విధంగా ముందుకెళుతున్నారు. కానీ వారిని ధీటుగా ఎదురుకుంటూ బందరు టిడిపి ఇంచార్జ్ కొల్లు రవీంద్ర, గుడివాడ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు దూకుడుగా పనిచేస్తున్నారు.


ఇక వీరిని ఎక్కడకక్కడ అడ్డుకుంటూ..అనూహ్యంగా వారిపై సానుభూతి పెరిగేలా చేస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరు టీడీపీ నేతల అరెస్టులు జరిగాయి. బందరులో వైసీపీ కార్యాలయానికి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అప్పనంగా ఇవ్వడంపై కొల్లు రవీంద్ర నిరసన తెలిపితే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇటు గుడివాడలో పేదల కూల్చివేతపై ప్రశ్నించిన రావిని అరెస్ట్ చేశారు. ఇద్దరు నేతలని ఒకే రోజు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లు అన్నీ తిప్పారు. ఈ పరిణామాలు వల్ల టీడీపీ నేతలపై సానుభూతి పెరిగింది తప్ప..అటు పేర్నికి గాని, ఇటు కొడాలికి గాని ఒరిగిందేమీ లేదు. మొత్తానికి కొల్లు, రావిలతో ఇద్దరు నానీలకు డ్యామేజ్ అయ్యేలా ఉంది.

