Site icon Neti Telugu

 బోడే జోరు..పెనమలూరులో టీడీపీకి లీడ్!

కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం 2008 నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన స్థానం. ఈ స్థానంలో కమ్మ, కాపు ఓట్ల తో పాటు, బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువ. వారే గెలుపుని ప్రభావితం చేస్తారు. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పార్థసారథి..కేవలం 177 ఓట్ల తేడాతో టి‌డి‌పిపై గెలిచారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి 32 వేల ఓట్ల వరకు పడ్డాయి.

ఇక 2014 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. టి‌డి‌పికి జనసేన సపోర్ట్ ఇచ్చింది..అలాగే టి‌డి‌పి గాలి ఉంది. దీంతో 31 వేల ఓట్ల మెజారిటీతో టి‌డి‌పి నుంచి బోడే ప్రసాద్ విజయం సాధించారు. టి‌డి‌పి అధికారంలోకి వచ్చాక పెనమలూరులో అభివృద్ధి జరిగింది. విజయవాడ నగరానికి ఆనుకునే పెనమలూరు ఉండటంతో అభివృద్ధి బాటలో వెళ్లింది. ఇటు రాజధాని అమరావతి కూడా దగ్గరే.

అయితే బోడే ప్రసాద్ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు..సంక్షేమ పథకాలు బాగా అమలయ్యాయి. దీంతో 2019 ఎన్నికల్లో ఇక్కడ బోడే మళ్ళీ గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ జగన్ గాలిలో సీన్ రివర్స్ అయింది. పైగా జనసేనతో పొట్టుతో బి‌ఎస్‌పి పోటీ చేసి ఓట్లు చీల్చడం బోడేకి నష్టం జరిగింది. వైసీపీ నుంచి పోటీ చేసి పార్థసారథి 11 వేల ఓట్ల మెజారిటీతో బోడేపై గెలిచారు. బి‌ఎస్‌పి పార్టీకి 15 వేల ఓట్ల వరకు పడ్డాయి.

అంటే ఓట్ల చీలిక బోడేకు నష్టం చేసింది. అయితే ఈ సారి ఆ పరిస్తితి ఉండదని తేలిపోయింది. జనసేన విడిగా పోటీ చేసిన పెనమలూరులో బోడే గెలవడం ఖాయమని తాజా సర్వేలు చెబుతున్నాయి. పొత్తు ఉంటే బోడేకు భారీ మెజారిటీ ఖాయమని తెలుస్తోంది. మొత్తానికి పెనమలూరులో టి‌డి‌పికి ఆధిక్యం కనిపిస్తుంది. 

Exit mobile version