రాజకీయాల్లో చెప్పిన విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల ప్రజలు నమ్మేస్తారనే కాన్సెప్ట్ రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది. ప్రత్యర్ధులకు చెక్ పెట్టే ఏదైనా ఒక అంశం..అంటే అది అబద్దం అవ్వవచ్చు..లేదా నిజం అవ్వవచ్చు..ఆ అంశాన్ని పదే పదే ప్రస్తావించడం వల్ల జనం అదే నిజం అనుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ విషయంలో వైసీపీ బాగా ఆరితేరిపోయిందని విశ్లేషకులు అంటున్నారు..నిజాలు సంగతి పక్కన పెడితే..అబద్దాలని పదే పదే చెప్పి గత ఎన్నికల్లో టీడీపీని ఎలా దెబ్బకొట్టారో తెలుసుగా అని అంటున్నారు.

కమ్మ వర్గానికే డీఎస్పీ పదోన్నతి, పింక్ డైమండ్ బాబు ఇంట్లో ఉందని, వివేకా హత్య బాబు చేయించారని, అమరావతి కమ్మ వాళ్ళది అని, 6 లక్షల కోట్ల అవినీతి అని, కోడి కత్తి కేసు బాబుదే అని..ఇలా ఒకటి రకరకాల నెగిటివ్ ప్రచారాలు వైసీపీ…టీడీపీపై చేసి దెబ్బకొట్టింది. ఇప్పటికీ అదే పరిస్తితి ఉందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నా సరే ఇలాంటి ప్రచాలని ఆపలేదని చెబుతున్నారు.

ఇక ఈ మధ్య జగన్ పదే పదే దుష్టచతుష్టయం అంటున్నారు..అంటే చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా కలిసి తనపై కుట్ర చేస్తున్నారని , అలాగే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అని విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలుసు టీడీపీకి అనుకూల మీడియా ఉంది..కానీ అవి చెప్పేవి అబద్దాలు అని జగన్ ప్రచారం. ఆ మీడియా చెప్పేది అబద్దం లేదో ప్రజలకు తెలుస్తోంది.

అదే సమయంలో తన సొంత మీడియా లేదని జగన్ చెబుతూ వస్తారు. ఆ మాటలని ప్రజలు నమ్మే పరిస్తితి ఏ మాత్రం లేదు..ఎందుకంటే వైసీపీ సొంత మీడియా ఏది అనేది తెలుసు. అలాగే భజన చేసే మీడియా ఏంటి అనేది తెలుసు. కాబట్టి రాజకీయాల్లో ఏది చెబితే అది నమ్మేస్తారని అనుకుంటే పొరపాటే.

Leave feedback about this