కడప జిల్లా రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అక్కడ తిరుగులేని బలంతో ఉన్న వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, టీడీపీ నేతలు బలపడటం..అలాగే కొందరు సీనియర్ నేతలు టీడీపీ వైపు చూడటం లాంటి అంశాలతో కడపలో వైసీపీకి కాస్త మైనస్ అవుతుంది. ఇప్పటికే వరదరాజులు రెడ్డి, వీరా శివారెడ్డి లాంటి వారు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారు.

ఇక తాజాగా డీఎల్ రవీంద్రా రెడ్డి సైతం టీడీపీ వైపు రావడానికి ఆసక్తిగా ఉన్నారు. జగన్ పాలన్‌పై తీవ్ర విమర్శలు చేసిన డీఎల్..మళ్ళీ చంద్రబాబు వస్తేనే రాష్ట్రం గాడిలో పడుతుందని, బాబు-పవన్ కలిసొస్తే ఇంకా మంచిదని అంటున్నారు. అయితే ఆరు సార్లు మైదుకూరు నుంచి కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచిన డీఎల్..గత ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీకి మద్ధతు ఇచ్చారు. కానీ గెలిచాక ఆయన్ని వైసీపీ పట్టించుకోవడం లేదు. పైగా జగన్ పాలనపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు.

దీంతో ఆయన వైసీపీని వీడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి మైదుకూరులో పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తేనే గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మైదుకూరు టీడీపీలో పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. బీసీ నేతని కాదని డీఎల్‌కు సీటు ఇవ్వడం అనేది కష్టమైన పని.

అలా అని డీఎల్ లాంటి నేతని వదులుకోవడానికి బాబు సిద్ధంగా లేరు..అందుకే ఆయనకు కడప ఎంపీ సీటు ఇవ్వాలని భావిస్తున్నారట. కానీ కడప ఎంపీ సీటులో గెలవడం ఈజీ కాదు. మైదుకూరు అయితేనే కాస్త ఈజీ. మరి బాబు ఎలా ముందుకెళ్తారో చూడాలి.

Leave feedback about this