తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో రాజమండ్రి కూడా ఒకటి..మొదట నుంచి రాజమండ్రిలో టిడిపి హవా నడుస్తోంది. రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లుగా విడిపోయాక కూడా ఆ రెండు చోట్ల టిడిపి ప్రభంజనం కొనసాగుతుంది. గత ఎన్నికల్లో కూడా సిటీ, రూరల్ సీట్లని టిడిపి గెలుచుకుంది. అయితే సిటీలో భారీ మెజారిటీతో టిడిపి గెలిచింది. వైసీపీ గాలిలో కూడా 30 వేల పైనే ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి భవాని గెలిచారు. అయితే ఓ వైపు ఎర్రన్నాయుడు కుమార్తె..మరో వైపు ఆదిరెడ్డి ఫ్యామిలీ కోడలు కావడంతో..ఆమె సత్తా చాటారు.

ఇక వచ్చే ఎన్నికల్లో అక్కడ టిడిపి నుంచి బరిలో దిగడానికి ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడీ అవుతున్నారు. భవాని ఎమ్మెల్యేగా ఉన్నా సరే..అక్కడ ప్రజా సమస్యలని పరిషరించడానికి శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు. అయితే ఇక్కడ టిడిపికి చెక్ పెట్టడానికి వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలువురు ఇంచార్జ్‌లని మార్చింది. రౌతుల సూర్యప్రకాశ్‌ని పక్కన పెట్టారు. శిఖాకొల్లు సుబ్రహ్మణ్యంని సైడ్ చేశారు. ఆఖరికి ఆకుల సత్యనారాయణని సైతం ఇంచార్జ్ గా పెట్టి తప్పించారు. చివరికి రాజ మండ్రి ఎంపీ మార్గాని భరత్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన ఇప్పుడు అక్కడ యాక్టివ్ గా తిరుగుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ బరిలో దిగాలని చూస్తున్నారు.

అయితే సిటీలో భరత్‌కు పెద్ద పట్టు ఉన్నట్లు కనిపించడం లేదు..పైగా ఆయన సోషల్ మీడియాలో హడావిడి తప్ప..ప్రజా సమస్యలని పట్టించుకున్నట్లు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అటు టిడిపి నుంచి ఆదిరెడ్డి వాసు మాత్రం దూకుడుగానే పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ రాజకీయ పరిస్తితులు గమనిస్తే టీడీపీదే పైచేయిగా ఉన్నట్లు కనిపిస్తుంది. జనసేనతో పొత్తు ఉంటే ఇంకా టిడిపికి తిరుగుండదు.
