వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేస్తారా? అంటే ఇందులో జగన్‌ని తప్పించి..150 మంది ఎమ్మెల్యేలకు యథాతధంగా సీట్లు దొరుకుతాయా? అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నెలకొంది. వీరికి మళ్ళీ సీటు ఇస్తే గెలవడం కష్టమని జగన్‌కు కూడా అవగాహన ఉంది. ఇప్పటికే సరిగ్గా పనిచేయని వారికి సీటు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. అయితే కొందరికి సీటు ఇవ్వాల్సిన పరిస్తితి ఉంటుంది. అలాంటి వారి సీట్లు మారుస్తారని తెలుస్తోంది.

కానీ కొందరికి మాత్రం మొహమాటం లేకుండా సీటు ఇవ్వరని చెప్పవచ్చు. ఇదే క్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు మళ్ళీ సీటు ఇచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో గెలిచేసిన ఎలిజాపై వ్యతిరేకత ఎక్కువగానే వచ్చిందని తెలుస్తోంది. పైగా ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో విభేదాలు ఉన్నాయి. ఈ సీటు ఎస్సీ రిజర్వడ్ కాకముందు..శ్రీధర్ తండ్రి విద్యాధరరావు.పలుమార్లు చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో చింతలపూడిపై కోటగిరి ఫ్యామిలీకి పట్టు ఉంది.

దీని వల్ల కోటగిరి మద్ధతు లేకపోతే ఇక్కడ వైసీపీ గెలుపు కాస్త కష్టపమవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో చింతలపూడిలో స్వల్పంగా వైసీపీకే ఆధిక్యం ఉందట. కానీ ఎలిజాకు సీటు ఇస్తే సమీకరణాలు మారిపోయి టీడీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందట. అందుకే ఈ సారి సీటు ఎలిజాకు ఇవ్వరని ప్రచారం జరుగుతుంది.

ఈ సీటుని పోలీసు అధికారిగా పనిచేసే ఓ వ్యక్తికి ఇస్తారని సమాచారం. ఎస్సీ అధికారికి ఈ సీటు ఇవ్వాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి చింతలపూడి సీటు చివరికి ఎవరికి దక్కుతుందో.
