ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి మంచి పట్టున్న విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి చావుదెబ్బ తగిలింది. ఏదో సిటీలో ఉన్న నాలుగు సీట్లని గెలుచుకుంది గాని రూరల్ ప్రాంతంలో చతికలపడింది. ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో దారుణంగా ఓడిపోయింది. పార్లమెంట్ పరిధిలో ఏడు సీట్లు ఉన్నాయి. పెందుర్తి, మాడుగుల, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం సీట్లు ఉన్నాయి. వీటిల్లో మాడుగుల, చోడవరం మినహా మిగిలిన సీట్లు టీడీపీ కంచుకోటలే. అయినా సరే టీడీపీ అన్నీ స్థానాల్లో దారుణంగా ఓడింది.

అయితే ఇప్పుడుప్పుడే ఆ సీట్లలో మార్పు కనిపిస్తోంది. పలు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బాగా కనిపిస్తోంది. దాదాపు అన్నీ స్థానాల్లో వైసీపీకి యాంటీ ఉంది. ముఖ్యంగా పాయకరావుపేట, నర్సీపట్నం, పెందుర్తి, ఎలమంచిలి సీట్లలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మళ్ళీ ఈ సీట్లలో వైసీపీ గెలుపు చాలా కష్టమని సర్వేల్లో తేలింది. అదే సమయంలో ఈ స్థానాల్లో టీడీపీ పరిస్తితి మెరుగ్గా ఉందా? అంటే కొన్ని స్థానాల్లో పర్లేదు గాని..కొన్ని స్థానాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది.

మాడుగుల సీటులో రామానాయుడుని తప్పించి పివిజి కుమార్‌ని ఇంచార్జ్ పెట్టారు. దీంతో రెండు వర్గాల మధ్య పోరు ఉంది. సీటు కోసం ఇద్దరు నేతలు గట్టిగా ట్రై చేస్తున్నారు. అటు చోడవరంలో కూడా అలాంటి పరిస్తితి కనిపిస్తోంది. అక్కడ బత్తుల తాతయ్య బాబు ఇంచార్జ్ గా ఉన్నారు. అదే సమయంలో కేఎస్‌ఎన్ రాజు సైతం ఈ సీటు కోసం ట్రై చేస్తున్నారు.

అటు అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందా సత్యనారాయణ ఉన్నారు..ఈయనకు పోటీగా బుద్దా నాగ జగదీశ్వరరావు కూడా పనిచేస్తున్నారు. ఇలా టీడీపీకి మంచి అవకాశం ఉన్నా సరే ఇలా సీట్ల కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పోరుకు చంద్రబాబు చెక్ పెడితే..అనకాపల్లి పరిధిలో మంచి ఫలితాలు వస్తాయి.
