వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాలసిన పని లేదు. ప్రతిపక్ష టిడిపి నేతలని టార్గెట్ చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో.. ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో..ఎన్ని సంఘటనలు జరిగాయో చెప్పాలంటే పేజీలు సరిపోవు. మరి ఆ రేంజ్ లో వైసీపీ కక్షపూరిత రాజకీయం నడిచింది.

ఇక టిడిపి అధినేత చంద్రబాబుని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు..ఆయని కొందరు నేతలు ఎలా బూతులు తిట్టారు..ఫ్యామిలీని ఎలా తిట్టారో అందరికీ తెలిసిందే. అయితే బాబుని ఏదొక రకంగా ఇబ్బంది పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇదే క్రమంలో స్కిల్ డెవల్‌పమెంట్ స్కామ్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఓ ఊదరగొడుతుంది. కానీ ఇందులో అవినీతి జరిగినట్లు తేల్చలేకపోతుంది. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదొరకంగా బాబుని ఇరికించాలనే చూస్తుంది. అసలు 300 కోట్లు కూడా పెట్టని స్కిల్ డెవల్‌పమెంట్ ప్రోగ్రాం..3,300 కోట్లు అవినీతి జరిగిందని వైసీపీ భజన మీడియా హడావిడి చేస్తుంది.

పైగా మంత్రి గుడివాడ అమర్నాథ్..త్వరలోనే బాబు అరెస్ట్ అవుతారని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఈడీ విచారణలో పది మంది అరెస్టయ్యారని, రేపో మాపో లోనికి వెళ్లేందుకు చంద్రబాబు కూడా సిద్ధంగా ఉన్నారని అమర్నాథ్ అంటున్నారు. అయితే ఇది పూర్తిగా రాజకీయ కక్షకు సంబంధించినదే అని చెప్పవచ్చు.

అటు ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుని కూడా టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని ఏపీ సిఐడి అధికారులు గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కస్టమర్లు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకపోయినా వైసీపీ ప్రభుత్వమే ఇదంతా చేయిస్తుందని, ఎలాంటి అక్రమాలు లేకుండా ఏదో జరిగిపోయినట్లు చూపించి..ఇప్పుడు సిఐడి చేత..రామోజీరావుపై కేసు పెట్టించారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే వైసీపీ ఎన్ని చేసిన..ఇవన్నీ రివర్స్ అయ్యి వైసీపీకే మైనస్ అయ్యేలా ఉన్నాయి.
