వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల జైల్లో ఉంచారు. ఆ తరువాత అనారోగ్య కారణాల రీత్యా కండిషన్ బెయిల్ నాలుగు వారాలు ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నాలుగు వారాలు లోపు చంద్రబాబు నాయుడు టిడిపిని అధికారంలో కి తీసుకురావడానికి కావలసిన ఏర్పాట్లు అన్ని సిద్ధం చేస్తారని టిడిపి నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు చాణక్య నీతికి తెలివితేటలకు నాలుగు వారాలు గడువు చాలా ఎక్కువ అని చెబుతున్నారు.ఈ నాలుగు వారాలలోనే చంద్రబాబు నాయుడు ఈసారి టిడిపి అధికారంలోనికి రావడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నారు.
చంద్రబాబు నాయుడుకు వచ్చింది తాత్కాలిక బెయిల్ అయినా చంద్రబాబు నాయుడు పూర్తి ఆత్మస్థైర్యంతో నేతలలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారు. కీలక అంశాలైన ఎన్నికల మేనిఫెస్టో,అభ్యర్థుల ప్రకటన,ఎన్నికల ప్రచారానికి సంబంధించి పార్టీ కార్యకర్తలు ఎటువంటి ప్రణాళికలు పాటించాలి అని వివరించటం,వాటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ నిర్ణయించడం చంద్రబాబు నాయుడు తక్షణ కర్తవ్యాలుగా చెబుతున్నారు.ఇప్పటికే 80 నుండి 100 స్థానాలలో అభ్యర్థుల ప్రకటన జరిగింది అని సన్నిహిత వర్గాలు అంటున్నారు.
ఆ జాబితా లోకేష్ కు చంద్రబాబు నాయుడు ఇచ్చారని,ఆ జాబితాలో ఉన్న కొందరికి లోకేష్ ఫోన్ చేసి ఈసారి అతనే అభ్యర్థి అని,అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోమని కొందరి నేతలకు చెబుతున్నట్లు సమాచారం.కానీ కొన్ని కీలక నియోజకవర్గం లో,సున్నితమైన నియోజకవర్గాలలో అభ్యర్థుల పేర్లను చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని టిడిపి నేతలు అంటున్నారు. ఏ నియోజకవర్గాల్లో అయితే సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లను పార్టీలో, నియోజకవర్గంలో పట్టున్న నేతలకు టికెట్లు ఇవ్వాలి అనుకుంటున్నారో వారి పేర్లను చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని, ఏ విధంగా సీనియర్లకు ఎలా నచ్చచెప్పి తమ వైపు తిప్పుకోవాలో చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు అని టిడిపి కార్యకర్తలు అంటున్నారు.
ఇప్పటికే ఈ నెలాఖరులోగా చంద్రబాబు నాయుడు కొందరి అభ్యర్థుల పేర్లను బహిరంగంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరికొందరి పేర్లను రహస్యంగా ఉంచి ఎన్నికల ముందు ప్రకటించాలని ఆలోచనలో ఉన్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నారు.
అటు పవన్ తో కూడా సమావేశమయ్యారుయి…కొన్ని రోజుల్లోనే జనసేనకు కేటాయించే సీట్లపై క్లారిటీ రావచ్చు. మరి ఈ ఉన్న తక్కువ సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీని గెలిపించడం కోసం ఎటువంటి వ్యూహాలు వేస్తారో? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సిందే