పుట్టిన గడ్డని చంద్రబాబు లైట్ తీసుకున్నారా? అక్కడ గెలుపు సాధ్యం అవ్వదని వదిలేస్తున్నారా? అంటే పరిస్తితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. చంద్రబాబు పుట్టిన వూరు నారావారిపల్లె…చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబు రాజకీయ జీవితం మొదలుపెట్టారు. 1978లో చంద్రబాబు కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఇక 1983లో బాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టిడిపి చేతిలో ఓడిపోయారు. తర్వాత బాబు..ఎన్టీఆర్ అల్లుడు అవ్వడం, టిడిపిలోకి వెళ్ళడం అనేది తెలిసిందే.
అయితే 1983, 1985లో టిడిపి అక్కడ గెలిచింది. మళ్ళీ 1994లో చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు టిడిపి నుంచి చంద్రగిరిలో గెలిచారు. ఇక తర్వాత నుంచి అక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గల్లా అరుణ కుమారి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ జోరు కోనసాగుతుంది. వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తున్నారు.
ఈ సారి ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. చెవిరెడ్డి వారసుడు మోహిత్ రెడ్డి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఎవరు పోటీ చేసిన అక్కడ వైసీపీకి లీడ్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇటు టిడిపి నుంచి పులివర్తి నాని కష్టపడుతున్నారు..కానీ చంద్రగిరిపై పట్టు దొరకడం లేదు.
అయితే చంద్రబాబు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నట్లు లేరు. అక్కడ టిడిపిని ఇంకా బలోపేతం చేయడం, గతంలో టిడిపికి మద్ధతు ఇచ్చిన కొన్ని వర్గాలు దూరమయ్యాయి. మళ్ళీ వారిని దగ్గర చేసుకునే విషయంలో వెనుకబడ్డారు. ఇక ఇదే పరిస్తితి కొనసాగితే ఈ సారి ఎన్నికల్లో కూడా చంద్రగిరిలో టిడిపిలో గెలవడం అసాధ్యమే.