రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీ చేసే ప్రతి పనిని ఎన్నికల్లో గెలుపు కోసం ఉపయోగించుకుంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు వైసిపి ఏ కార్యక్రమం చేపట్టినా ఎన్నికల ప్రచారం కోసమే అనేలా ఉన్నాయి. ఇప్పటివరకు ఇచ్చిన అన్ని పథకాలకు జగన్ పేరు ఉంటే ఇప్పుడు వచ్చే వాటిపైన జగన్ ఫోటోలు, వైసీపీ రంగులతో ప్రభుత్వ డబ్బును ధారాళంగా ఖర్చు చేస్తున్నారు.
అటువంటి వాటిల్లో కొత్తగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం మంచిది. కానీ దానికి జగనన్న ఆరోగ్య సురక్ష అంటూ డాక్టర్లు కూర్చునే ప్రదేశం నుండి పేషెంట్లు తీసుకువెళ్లే మందుల వరకు పెద్ద పెద్ద కవర్లతో జగన్ బొమ్మతో వైసిపి రంగులతో అధికారికంగానే వైసీపీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిందని చెప్పవచ్చు. ఇది ఎన్నికల కోసమే అని సామాన్యుడికి సైతం అర్థమవుతుంది. ఆరోగ్య సురక్ష అంటూ ప్రజలకు జరిగే మేలు లేకపోయినా ఈ గొప్పలకు మాత్రం ఖర్చు పెడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.
అధికార పార్టీ వారు ఇటువంటి పథకాలు ఎన్నైనా తీసుకొస్తారు కానీ వాటిని కొందరు ప్రముఖులతో పబ్లిసిటీ ఇప్పించటమే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.వైసిపి వారు ఎప్పుడూ తన పార్టీ చేసే కార్యక్రమాల గురించి గొప్పగానే చెబుతూ ఉంటారు కానీ వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వారితో వీరు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి పొగిడించడం అంటే మామూలు విషయం కాదు.
అది యువతను ప్రభావం చేయగల నాయకులతో మాట్లాడించటం అంటే సామాన్య విషయం కాదు. ఆ నాయకులు ఎవరో కాదు సిఐడి మాజీ చీఫ్ జెడి లక్ష్మీనారాయణ, ప్రజల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన జయప్రకాష్ నారాయణ. వ్యక్తిగతంగా వీరి ఇరువురు ప్రసంగాలకు యువత ప్రభావం చెందుతారు. తాము కూడా అలాంటి నాయకులుగా,ఉద్యోగులుగా ఉండాలని అందరూ ఆశపడిన పడుతూ ఉంటారు.వీరిని ఆదర్శంగా తీసుకొని ఆ ఉద్యోగాలకు ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు.
కానీ అటువంటి వారే ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి పొగుడుతూ ఉంటే అయోమయంగా చూస్తున్నారు. ఒక నాయకుడు జగన్ తిట్టినవారు, ఇంకొక నాయకుడు జగన్ అరెస్టు చేసిన వారు. కానీ ఇప్పుడు వారిద్దరూ జగన్ మంచి చేస్తున్నారు రాష్ట్రాన్ని కి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటూ చెబుతుంటే రాజకీయ నాయకులే కాదు సామాన్య ప్రజల సైతం ఆశ్చర్యంగా చూస్తున్నారు.వీరి మాటల ప్రభావం ప్రజలపై ఎంత ఉంటుందో తెలియదు గానీ ఈ నాయకులపై ఉన్న గౌరవం మాత్రం పోగొట్టుకుంటారేమో.వీరు ఇలా మాట్లాడటం వైసిపి గురించి గొప్పలు చెప్పడం జగన్ స్ట్రాటజీ అని ఎవరికైనా అర్థమవుతుంది