రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీ జంప్ చేయడమనేది రాజకీయ నేతల ఇష్టం. కానీ జంపింగ్ అనేది అర్ధవంతంగా ఉండాలి తప్ప..అధికారం కోసం ఉండకూడదు. చాలామంది నేతలు పార్టీ మారేప్పుడు ప్రజల కోసమని చెబుతారు గాని..ఎవరికి వారు సొంత ప్రయోజనాల కోసమే పార్టీ మారతారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక అలాంటి వారిని ప్రజలు ఆదరించడం కూడా జరగదు.

గతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. అధికారం కోసమే వారు జంప్ చేశారని చెప్పవచ్చు. అందుకే 2019 ఎన్నికల్లో అలా జంప్ చేసిన ఎమ్మెల్యేల్లో ఒక్క గొట్టిపాటి రవికుమార్ తప్ప..ఎవరూ గెలవలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్-మద్దాలి గిరి, చీరాల-కరణం బలరాం, విశాఖ సౌత్-వాసుపల్లి గణేశ్ పార్టీ మారారు.

మరి వీరిలో ఎంతమంది ఈ సారి గెలిచి బయటపడతారు? అంటే చెప్పడం కష్టమే. ఈ సారి ఎవరికి అంతగా అనుకూల పరిస్తితులు లేవు..అలా అని ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పే పరిస్తితి కూడా లేదు. పైగా వీరిలో ఎవరికి నెక్స్ట్ సీటు దక్కుతుందో గ్యారెంటీ లేదు. నలుగురుకు జగన్ మళ్ళీ సీట్లు ఇస్తారా? లేదా అనేది గ్యారెంటీ లేదు. వీరిలో వంశీకి ఒక్కరికే క్లారిటీ ఉంది. మళ్ళీ ఈయనకు సీటు ఫిక్స్. ఇక ఈయనపై టీడీపీ నుంచి బలమైన అభ్యర్ధి పెట్టకపోతే..వంశీ గెలుపు సులువే.

కానీ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్తితి క్లారిటీ లేదు. సీటు విషయం తేలలేదు. అదే సమయంలో సీటు ఇచ్చినా సరే గెలుస్తారనే గ్యారెంటీ లేదు. పైగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే.



Leave feedback about this