ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర దాదాపు ముగింపుకు వచ్చేసింది. గత నెలన్నర రోజుల నుంచి లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలోని 14 స్థానాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. జనవరి 27న మొదలైన పాదయాత్ర..మధ్యలో తారకరత్న మరణంతో రెండు రోజులు బ్రేకు పడింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల రెండు రోజులు బ్రేకులు పడింది.

మార్చి 11న తంబళ్ళపల్లెలో లోకేష్ పాదయాత్ర ఆగింది. 14న మళ్ళీ మొదలైంది..తంబళ్ళపల్లెలో ముగింపు దశకు వచ్చింది. ఇంకా తర్వాత అనంతపురం కదిరి నుంచి పాదయాత్ర మొదలవుతుంది. అయితే ఏ జిల్లాలో లేని విధంగా చిత్తూరులోనే అన్నీ స్థానాలు కవర్ అయ్యేలా పాదయాత్ర సాగింది. అయితే ఈ పాదయాత్ర వల్ల చిత్తూరులో టిడిపికి ఏమైనా మైలేజ్ పెరిగిందా? అంటే పెరిగిందనే చెప్పాలి. పేరుకు చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికి ఇక్కడ వైసీపీ హవా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ 13, టిడిపి 1 స్థానం మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు కుప్పంతో సహ 14 స్థానాలు గెలుచుకోవాలని వైసీపీ చూస్తుంది.

కానీ ఆ పరిస్తితిని టిడిపి తారుమారు చేసింది..టిడిపి బలపడింది. లోకేష్ పాదయాత్ర ఇంకా బలపర్చింది. జిల్లాలో ఇప్పుడు టిడిపి..కుప్పం, పలమనేరు, నగరి, మదనపల్లె సీట్లలో గెలిచే ఛాన్స్ ఉంది. అలాగే పీలేరు, శ్రీకాళహస్తిలో కాస్త కష్టపడితే గెలవచ్చు.

అంటే 14 సీట్లు ఉంటే వైసీపీ 8, టిడిపి 6 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది..అంటే ఇంకా వైసీపీకే లీడ్ ఉంటుందని చెప్పవచ్చు. అయితే జనసేనతో గాని పొత్తు ఉంటే తిరుపతి, చిత్తూరు సీట్లలో వైసీపీకి గెలవడం కష్టం అవ్వవచ్చు. చూడాలి మరి చిత్తూరులో వైసీపీ లీడ్ నిలబెట్టుకుంటుందో లేదో.
