తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి..ప్రత్తిపాడులో పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లి..అనూహ్యంగా వరుపుల రాజా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ప్రత్తిపాడులో టిడిపికి ఆధిక్యం పెరుగుతుందనే తరుణంలో ఆయన మరణించడం…పార్టీకి కాస్త లోటు అని చెప్పవచ్చు. కానీ ఆ లోటుని భర్తీ చేస్తూ తాజాగా రాజా భార్య సత్యప్రభకు ప్రత్తిపాడు బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రత్తిపాడులో టిడిపి గెలుపు ఫిక్స్ అయిందని చెప్పవచ్చు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో టిడిపి ఇప్పటివరకు అయిదుసార్లు గెలిచింది. కానీ గత రెండు ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా గెలుపు దగ్గరకొచ్చి బోల్తా కొట్టింది. 2014 ఎన్నికల్లో కేవలం 3 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోగా, 2019 ఎన్నికల్లో 4 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో టిడిపి ఓడిపోయింది. రెండు సార్లు వైసీపీ గెలిచింది. కానీ ఈ సారి వైసీపీని ఆదరించడానికి ప్రత్తిపాడు ప్రజలు రెడీగా లేరు. రెండుసార్లు గెలిపించిన ప్రత్తిపాడు ప్రజలకు వైసీపీ చేసిందేమి లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న సరే అక్కడ అభివృద్ధి జరగడం లేదు. పైగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

దీంతో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఆయన నెక్స్ట్ సీటు ఇస్తే గెలవడం కష్టమని ఇటీవల సర్వేల్లో తేలింది. అయితే టిడిపి బలపడుతున్న తరుణంలో రాజా చనిపోవడం కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో నెక్స్ట్ ప్రత్తిపాడు సీటు ఎవరికి ఇస్తారనే చర్చ నడిచింది.

ఈ క్రమంలో రాజా భార్య సత్యప్రభకు ప్రత్తిపాడు సీటు ఫిక్స్ చేశారు. ఒకవేళ రాజా ఫ్యామిలీకి కాకుండా వేరే వాళ్ళకు సీటు ఇస్తే ప్రత్తిపాడులో టిడిపికి రిస్క్ పెరిగేది..కానీ ఇప్పుడు రాజా భార్యకు సీటు ఫిక్స్ చేసి ప్రత్తిపాడులో టిడిపి గెలుపుని ఫిక్స్ చేసుకుందని చెప్పవచ్చు.
