రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడుతూ వస్తుంది..గత ఎన్నికలతో పోలిస్తే..ఇప్పుడు పార్టీ బాగా బలపడింది..గెలుపుకు దగ్గరగా వస్తుంది. అయితే ఇంకా కొన్ని స్థానాల్లో టిడిపికి పట్టు దొరకడం లేదు. అసాలు కొన్ని స్థానాల్లో టిడిపి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయిపోయింది..నెక్స్ట్ కూడా గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని స్థానాల్లో టిడిపికి గెలుపు కలగానే మిగిలిపోయేలా ఉంది.

ఉమ్మడి ప్రకాశంలో 12 స్థానాలు ఉన్నాయి..తాజాగా వచ్చిన సర్వేలో టిడిపి…అద్దంకి, పర్చూరు, కొండపి, సంతనూతలపాడు, కనిగిరి, ఒంగోలు స్థానాల్లో గెలుస్తుందని తేలింది. వైసీపీ…మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కందుకూరు, దర్శి సీట్లలో గెలుస్తుందని, చీరాలలో టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది. అయితే వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్న సీట్లలో మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కందుకూరుల్లో టిడిపి గెలిచి చాలా ఏళ్ళు అయింది. దర్శిలో అంటే 2014లో గెలిచింది. అది పక్కన పెడితే మిగిలిన స్థానాల్లో టిడిపి గెలిచి చాలా ఏళ్లు అవుతుంది.

కమ్మ వర్గం ప్రభావం ఉంటూ టిడిపి బలమైన కార్యకర్తలు ఉన్న కందుకూరులో 1999 ఎన్నికళ్లో చివరిసారిగా టిడిపి గెలిచింది. మళ్ళీ ఆ తర్వాత గెలవలేదు..నెక్స్ట్ కూడా గెలిచే ఛాన్స్ లేదని తేలింది. ఇక యర్రగొండపాలెంలో గత మూడు ఎన్నికల నుంచి గెలవడం లేదు..ఈ సారి కూడా గెలిచే ఛాన్స్ లేదు. అటు మార్కాపురంలో 1983 ఒకసారి,. 2009లో ఒకసారి గెలిచింది. గత రెండు ఎన్నికల్లో గెలవలేదు..ఈ సారి గెలుపు ఛాన్స్ లేదు.

గిద్దలూరులో అదే పరిస్తితి 1999 ఎన్నికల్లో చివరిగా గెలిచింది..గత నాలుగు ఎన్నికల నుంచి గెలుపు గుర్రం ఎక్కలేదు. ఈ సారి కూడా గెలిచే ఛాన్స్ లేదని సర్వేలో తేలింది. చూడాలి మరి ఎన్నికలనాటికైనా వీటిల్లో ఏదొకటి టిడిపి గెలుస్తుందేమో.
