సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఇంకా లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇక్కడ పలు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఎన్నికలై మూడున్నర ఏళ్ళు దాటిన సరే ఇంకా ఇక్కడ కొన్ని చోట్ల నాయకులు లేరు. జిల్లాలో 14 సీట్లు ఉన్నాయి..వాటిల్లో కొన్ని చోట్ల ఇంచార్జ్ లు లేరు. ఇటీవలే గంగాధర నెల్లూరు, సత్యవేడు లాంటి స్థానాల్లో ఇంచార్జ్‌లని పెట్టారు. కానీ చిత్తూరు అసెంబ్లీ, పూతలపట్టు స్థానాల్లో ఇంచార్జ్‌లు లేరు.

ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చిత్తూరు పార్లమెంట్..కేవలం కుప్పంలో చంద్రబాబుకు మెజారిటీ బట్టి చిత్తూరు పార్లమెంట్ లో టీడీపీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అయితే 2009, 2014 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్‌ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ తరుపున చంద్రబాబు బాల్య స్నేహితుడు శివప్రసాద్ గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో కుప్పంలో బాబుకు మెజారిటీ తక్కువ వచ్చింది..దీంతో చిత్తూరు పార్లమెంట్ లో శివప్రసాద్ ఓడిపోయారు.

ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల శివప్రసాద్ చనిపోయారు. అప్పటినుంచి అక్కడ టీడీపీకి లీడర్ లేరు. అయితే ఈ సీటు కోసం శివప్రసాద్ అల్లుడు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రైల్వే కోడూరు ఇంచార్జ్ గా ఉన్నారు. కానీ అక్కడ టీడీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. గెలుపు అవకాశాలు మెరుగ్గా లేవు. దీంతో శివప్రసాద్ చిత్తూరు ఎంపీ స్థానంలో పోటీ చేయాలని చూస్తున్నారు. మరి చంద్రబాబు..శివప్రసాద్ అల్లుడుకు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.
