గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో గెలిచిన స్థానాల్లో మైలవరం కూడా ఒకటి. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఈ స్థానంలో వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. అది కూడా తన చిరకాల ప్రత్యర్ధి దేవినేని ఉమాకు చెక్ పెట్టారు. అలా తొలిసారి తన ప్రత్యర్ధిపై గెలిచిన వసంతకు..తర్వాత తర్వాత అధికార బలం బట్టి చూసుకుంటే అంతా బాగానే ఉంది గాని..రాజకీయంగా మైలవరంలో ఆయన వెనుకబడిపోతూ వచ్చారు.

త్వరగానే ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. అటు ఆయన బంధువులు, అనుచరుల అక్రమాలకు అంతే లేదని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ అంశంలో వైసీపీ అధిష్టానం సైతం వసంతని వరించిందని తెలిసింది. పైగా మైలవరంలో అభివృద్ధి తక్కువ. ఈ అంశాలు వసంతకు బాగా ఇబ్బందిగా మారాయి. ఇదే క్రమంలో మంత్రి జోగి రమేష్ వర్గంతో విభేదాలు ఉన్నాయి. జోగి సొంత నియోజకవర్గం మైలవరం. కానీ 2019లో ఆయన పెడన వెళ్ళి పోటీ చేసి గెలిచారు.

అయినా సరే మైలవరంలో తన ఆధిక్యం తగ్గకుండా చూసుకుంటున్నారు. పైగా మంత్రి అయ్యాక అక్కడ కూడా పెత్తనం చేస్తున్నారని తెలిసింది. ఇదే క్రమంలో వసంత వర్గానికి కూడా చెక్ పెడుతున్నారని తెలిసింది.

వసంతకు వ్యతిరేకంగా జోగి వర్గం ప్రచారం కూడా చేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా వసంత మీడియాతో చెప్పారు. దీంతో ఈ విభేదాలపై సజ్జల రామకృష్ణారెడ్డి సైతం స్పందించారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందని చెప్పారు. కానీ అక్కడ వసంత-జోగి వర్గాల మధ్య రచ్చ కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది.

దీంతో ఈ పంచాయితీ కాస్త ఇప్పుడు జగన్ వద్దకు చేరిందట ..ఈ క్రమంలో జగన్ మైలవరంలోని కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అక్కడున్న సమస్యలు తెలుసుకుని నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరికి సీటు ఇవ్వాలనే అంశంపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న సర్వేల్లో మళ్ళీ వసంతకు సీటు దక్కడం కష్టమని అంటున్నారు. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Leave feedback about this