పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి షాక్ ఇచ్చిన టిడిపి…ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా షాక్ ఇస్తుందా? ప్రస్తుతం ఉన్న పరిస్తితులని చూస్తుంటే కాస్త డౌట్ గానే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఆల్రెడీ పోలింగ్ మొదలైంది.. సిఎం జగన్ తో సహ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు.

అయితే 7 స్థానాలకు వైసీపీ అభ్యర్ధులని నిలబెట్టింది. ఇటు టిడిపి సైతం ఒక అభ్యర్ధిని పెట్టింది. మామూలుగా వైసీపీకి ఉన్న సంఖ్యా బలం 151, టిడిపికి 23, జనసేన 1 సభ్యుడు ఉన్నారు. అయితే టిడిపి నుంచి నలుగురు, జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్లారు. దీంతో వైసీపీ బలం 156కు చేరుకుంది. ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి..అంటే 7 స్థానాలని వైసీపీ ఈజీగా గెలిచేస్తుంది. కానీ వైసీపీలో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు టిడిపికి ఓటు వేస్తే సీన్ మారుతుంది. టిడిపికి ప్రస్తుతం ఉన్న బలం 19 మంది..వైసీపీ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు కలుపుకుంటే 21..ఎమ్మెల్సీ కావాలంటే టిడిపికి ఇంకో ఎమ్మెల్యే కావాలి. అయితే టిడిపితో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కొత్తగా బాంబు పేల్చారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ తెలుగుదేశం చరిత్ర సృష్టిస్తుoదని టీడీపీ పోలింగ్ ఏజెంట్ నిమ్మల రామానాయుడు అన్నారు. అంతరాత్మ ప్రభోదానుసారావు వైసీపీ ఎమ్మెల్యేలు తమకు ఓటు వేయబోతున్నారన్నారుని, వైసీపీలో అసంతృప్తితో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోనే ఉన్నారని అన్నారు.దీంతో వైసీపీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా షాక్ తగులుతుందా? అనే పరిస్తితి. చూడాలి మరి ఎమ్మెల్సీ ఫలితాల్లో ట్విస్ట్ లు ఉంటాయేమో.
