టీడీపీలో దూకుడుగా ఉండే నాయకులకు ఎక్కడక్కడ చెక్ పెట్టే దిశగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అధికార బలంతో చాలావరకు ఇబ్బందులు పెడుతూనే వస్తున్నారు. కేసులు పెట్టడం, జైలుకు పంపడం లాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇదే క్రమంలో నిత్యం జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని ఏ విధంగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఆయనపై ఎన్ని రకాల కేసులు ఉన్నాయో అందరికీ తెలిసిందే.

అయితే అయ్యన్న కూడా ఎక్కడా తగ్గడం లేదు..జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా తమపై విరుచుకుపడుతున్న అయ్యన్నకు మరొకసారి చెక్ పెట్టాలని జగన్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. నర్సీపట్నంలో మళ్ళీ ఓడించాలని చూస్తున్నారు. నర్సీపట్నం అంటే అయ్యన్న కంచుకోట..అక్కడ ఆరుసార్లు గెలిచారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ చేతుల్లో అయ్యన్న ఓడిపోయారు. ఇక ఈ సారి కూడా అయ్యన్నకు అలాగే చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. కానీ పరిస్తితులు చూస్తే అలా కనిపించడం లేదు.

అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్‌కు పాజిటివ్ కనిపించడం లేదు..కాస్త వ్యతిరేకత కనిపిస్తున్నట్లు ఉంది..ఇదే సమయంలో అయ్యన్న బలపడుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ నర్సీపట్నంలో తాజాగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, తాండవ-ఏలేరు ప్రాజెక్టులకు సంబంధించి కాలువల పనులకు శంఖుస్థాపనలు చేశారు. అంటే నర్సీపట్నంలో అభివృద్ధి చేస్తున్నామని జగన్ చూపించే ప్రయత్నం చేశారు.


అయితే రోడ్లపై గుంతలు పూడ్చడానికే డబ్బులు ఇవ్వట్లేదని, ఇంకా ఇవి ఎలా చేస్తారని అయ్యన్న అంటున్నారు. కానీ ఏదేమైనా గాని నర్సీపట్నంలో అయ్యన్నకు కాస్త పాజిటివ్ కనిపిస్తోంది. ఈ సారి ఆయన నుంచి వైసీపీకి గట్టి పోటీ ఎదరవడం ఖాయం.
