నందమూరి ఫ్యామిలీ నుంచి పోటీ చేయడానికి మరోకరు సిద్ధమయ్యారు..ఇప్పటికే బాలయ్య, సుహాసిని టీడీపీలో ఉన్నారు. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి మరికొందరు రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అందులోనూ గుడివాడలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని టాక్ వస్తుంది. అయితే ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు.

కానీ తాజాగా తారకరత్న…వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు..తాజాగా గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్ళిన తారకరత్న..నెక్స్ట్ తాను పోటీకి రెడీ అని చెప్పుకొచ్చారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం టీడీపీ కోసం ప్రచారం చేయడానికి వస్తారని అన్నారు. ఇక ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారో రారో అనే విషయాన్ని పక్కన పెడితే..తారకరత్నకు పోటీకి అనుకూల అంశాలు ఉన్నాయా? అసలు ఆయన పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయా? అనే అంశాలని ఒక్కసారి చూస్తే..తారకరత్నకు సీటు విషయంలో చంద్రబాబు గ్యారెంటీ ఇచ్చారో లేదో తెలియదు.

కాకపోతే ఎప్పటినుంచో గుడివాడ లేదా గన్నవరంల్లో..నందమూరి ఫ్యామిలీ వాళ్ళని బరిలో దింపాలని..టీడీపీ నుంచి ఎదిగి వైసీపీలోకి వెళ్ళి చంద్రబాబుని ఇష్టమొచ్చినట్లు తిడుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలకు చెక్ పెట్టాలసిన అవసరం ఉందని, వారికి చెక్ పెట్టాలంటే నందమూరి ఫ్యామిలీని బరిలో దింపాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అయితే గుడివాడలో రావి వెంకటేశ్వరరావు ఇంచార్జ్ గా ఉన్నారు. ఇప్పటికే ఆయన పలుమార్లు సీటు త్యాగం చేశారు. కాబట్టి ఆయన్ని తప్పించడం సాధ్యం కాదు.

కానీ గన్నవరంలో బచ్చుల అర్జునుడు ఇంచార్జ్ గా ఉన్నారు. కాకపోతే బచ్చులకు అంత పాజిటివ్ లేదు. ఆయన్ని తీసేసి వేరే నాయకుడుని పెట్టాలని గన్నవరం టీడీపీ శ్రేణులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి తారకరత్నకు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే..గన్నవరంలో ఛాన్స్ ఇవ్వవచ్చు..కానీ బాబు సీటు ఇస్తారా? లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు.
