ఏదేమైనా పక్కా ప్లాన్ ప్రకారం రాజకీయం చేసి..ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి..ప్రత్యర్ధులని దెబ్బతీయడంలో వైసీపీ రాజకీయమే వేరు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త అమలు చేసే వ్యూహాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ టీం వ్యూహాలతోనే జగన్ ముందుకెళుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్..అదే తరహా వ్యూహాలు వేస్తూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారని చెప్పవచ్చు.

వారితోనే ప్రతిపక్షాలని రాజకీయంగా దెబ్బకొట్టే విధంగా ముందుకెళుతున్నారు. ఎందుకంటే ఏ పథకమైన వారి చేతుల్లోనే ఉంటుంది..దీంతో ఎవరైనా వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పాలంటే ఇబ్బంది. ఇక ఇప్పుడు ఆ వాలంటీర్లతోనే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ స్కెచ్ వేసింది. ఇప్పటికే పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్‌గా గెలవడానికి వాలంటీర్ల కృషి చాలా ఉంది. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు పోతాయి. ఇదే కాన్సెప్ట్. దీంతో జనం కూడా ఎందుకొచ్చిన గొడవ అని..వైసీపీకి ఓటు వేసిన పరిస్తితి.

ఇక నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వారి ద్వారానే గెలవాలని వైసీపీ చూస్తుంది. ప్రతి ఇంటికెళ్ళి వైసీపీకి ఓటు వేసేలా చూసుకోవాలని ఇప్పటినుంచే దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు వస్తే..వాలంటీర్లని తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. అలాగే వాలంటీర్లు ఇంకా దూకుడుగా పనిచేయడం కోసం..తాజాగా మంత్రి పినిపే విశ్వరూప్..కొత్త ట్విస్ట్ ఇచ్చారు..మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.15 వేలు అవుతుందని ఎర వేశారు.

ఇప్పటికే వాలంటీర్లు ఎక్కువ శాతం వైసీపీ కార్యకర్తలే..ఇంకా వారికి జీతం పెంచుతామనే ఒక స్టేట్‌మెంట్ తో ఇంకా ఏ మాత్రం తగ్గకుండా పనిచేసే ఛాన్స్ ఉంది. చూడాలి మరి వాలంటీర్లు వైసీపీ విజయానికి ఏ మాత్రం కృషి చేస్తారో .

Leave feedback about this