భీమిలి నియోజకవర్గం
సాగరం తీరాన ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న నియోజకవర్గం.భీమిలి లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాస్ ఉన్నారు.భీమిలి టిడిపికి కంచుకోట. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా సబ్బం హరి పోటీ చేశారు ఆఖరి నిమిషంలో ఆయన పేరును ఖరారు చేయడంతో ఇటువంటి ప్రచారం లేకుండానే సబ్బం హరి అవంతి శ్రీనివాస్‌కు గట్టి పోటీ ఇచ్చారని చెప్పవచ్చు.టిడిపి నే కాకుండా జనసేన తరఫున పంచకర్ల సందీప్ పోటీ చేసి కొన్ని ఓట్లు సంపాదించారు.2019 లోనే టిడిపి జనసేన పొత్తు ఉన్నట్లయితే కచ్చితంగా అవంతి గెలిచేవారు కాదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం భీమిలి. గెలిచిన తర్వాత అవంతి శ్రీనివాస్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. మంత్రి పదవి వచ్చిన నియోజకవర్గం విమర్శలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో అవంతిని పక్కన పెడితే అవంతి నియోజకవర్గం కూడా దూరంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అవంతి శ్రీనివాస్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. భీమిలి నియోజకవర్గం జగనన్న కాలనీలలో అవినీతి,వివిధ కమ్యూనిటీలకు కమ్యూనిటీ హాల్ లో నిర్మాణం చేస్తారని చెప్పి ఏదీ చేయలేదు.ఇప్పుడు భీమిలి నుంచి వైసిపి వారు ఓటు అడగాలంటే తాము ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్ప మరో అంశం లేదని రాజకీయ వర్గాలు అంటున్నారు. అంతేకాకుండా గుడివాడ అమర్నాథ్ కు అవంతి శ్రీనివాస్ కు మధ్య పోసగడం లేదని సన్నిహిత వర్గాలు అంటున్నారు.అవంతి శ్రీనివాస్ ను పక్కన పెట్టేందుకు గుడివాడ అమర్నాథ్ పావులు కలుపుతున్నారని అందరూ అంటున్నారు. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం ఈసారి భీమిలి నుంచి పోటీ చేసేది అవంతి శ్రీనివాస్ అని తేల్చేసింది.మరి ఇటువంటి తరుణంలో అవంతి గెలుపు కష్టమే కదా….
టిడిపి తరఫున గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారు అని టిడిపి చెబుతోంది. అవంతి పై పోటీగా ఎవరిని నిలబెట్టాలి అని ఆలోచిస్తున్న తరుణంలో భీమిలి నుంచి గీతం సంస్థల అధినేత భరత్ ను నిలబెట్టాలని అధిష్టానం భావించగా, గంటా శ్రీనివాసరావు తాను పోటీ చేస్తానని తెలపడంతో ఆ స్థానాన్ని గంట శ్రీనివాస్ రావు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక్కడ జనసేనకు కూడా మంచి పట్టు ఉంది,కానీ ఖచ్చితంగా గెలవాలని లక్ష్యంతో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబెట్టాలని టిడిపి భావిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే గంటా శ్రీనివాసరావు పేరును ఖరారు చేసినట్టు చెప్తుంది.గంట శ్రీనివాసరావుకు ఒక ప్రత్యేకత ఉంది.రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరనుంచి ప్రతిసారి ఒక కొత్త నియోజకవర్గ ఎంచుకోవడం,అక్కడ నుంచి విజయం సాధించి చూపటం ఆయన స్పెషల్.మరి ఈసారి భీమిలిలో టిడిపి జెండా ఎగరేస్తారా వేచి చూడాలి!!!!!