నందికొట్కూరు నియోజకవర్గం ఈ నియోజకవర్గ రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేకమైనది. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైనా అక్కడ పెత్తనం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దే అన్నది బహిరంగ రహస్యం.
ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఆర్థర్ పోటీ చేసి విజయం సాధించారు. కానీ గెలిచిన దగ్గరనుంచి బైరెడ్డి వర్గానికి ఆర్థర్ వర్గానికి మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి. ఒకానొక సమయంలో ఆర్డర్ బహిరంగంగానే తనకు పేరుకు మాత్రమే పదవి అని పెత్తనం మొత్తం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి దే అని విమర్శించారు. ఈసారి తనకు టికెట్ ఇస్తే పదవి అధికారం రెండూ కూడా తనకే ఉండాలని ఆర్డర్ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. కానీ అనూహ్యంగా వైసిపి అధినేత ఇంచార్జిల మార్పులో నందికొట్కూర్ కు డాక్టర్ సుధీర్ ధారకు ఇవ్వటంతో ఆర్థర్ మౌనంగా ఉండిపోయారు. డాక్టర్ సుదీర్ దారా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గానికి చెందిన వారే అయి ఉండడంతో ఆర్డర్ వైసీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
వర్గ పోరుతో సతమతమవుతున్న నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈసారి డాక్టర్ సుదీర్ దారాను గెలిపించుకుంటారా??? లేక ఇండిపెండెంట్ గా ఆర్థర్ బైరెడ్డి వర్గానికి పోటీ ఇస్తారా?? వేచి చూడాల్సిందే!!!