కమ్మ వర్సెస్ రెడ్డి నాయకుల మధ్య ఏపీలో ఓ చిన్నపాటి యుద్ధమే నడుస్తున్న విషయం తెలిసిందే. అగ్రనేతల నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకు ఈ పోరు నడుస్తోంది. ఈ పోరులో పైచేయి సాధించాలని ఎవరికి వారు ట్రై చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో కమ్మ నేతలపై రెడ్డి నేతలు పూర్తిగా డామినేట్ చేశారు. సక్సెస్ అయ్యారు. కానీ ఈ సారి రెడ్డి నేతలకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని కమ్మ నేతలు పనిచేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ యుద్ధం తారస్థాయికి చేరుకుంది.

ఇదే క్రమంలో పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రంగా నడుస్తోంది. గత ఎన్నికల్లో యరపతినేనిపై కాసు పైచేయి సాధించారు. ఈ సారి ఎన్నికల్లో కసుకు చెక్ పెట్టాలని యరపతినేని పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య రాజకీయ యుద్ధం ఊహించని స్థాయిలో జరుగుతుంది. అలాగే ఇప్పుడు కాసు అక్రమాలకు హద్దు లేదని యరపతినేని ఆరోపిస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా యరపతినేని అక్రమాలకు లెక్క లేదని కాసు వర్గం ఆరోపిస్తుంది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.


పైగా గత ఎన్నికల్లో యరపతినేనికి కాసు చెక్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుందని కాసు వర్గం అంటుంది. దమ్ముంటే గెలిచి చూపించాలని చెప్పి యరపతినేని వర్గం సవాల్ చేస్తుంది. అలాగే గతంలో కాసు ఫ్యామిలీ ఎప్పుడెప్పుడు ఓడిపోయిందో చరిత్ర తిరగేస్తున్నారు. గతంలో నరసారావుపేటలో కోడెల శివప్రసాద్ చేతిలో కాసు తండ్రి కాసు కృష్ణారెడ్డి రెండు సార్లు ఓడిపోయారని, అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి సైతం ఓటమి పాలయ్యారని చెప్పి..మొత్తం చరిత్ర చెబుతున్నారు. అయినా కాసు వల్ల ఇదేం ఖర్మ గురజాలకు అంటూ ప్రచారం చేస్తున్నారు. మరి ఈ సారి గురజాలలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

