రాష్ట్రంలో జగన్‌కు అనుకూల పరిస్తితులు తగ్గుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. గత ఎన్నికల్లో అనుకూలంగా ఉన్న అంశాలు ఇప్పుడు యాంటీగా మారుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ విషయంలో జగన్‌కు ఇంకా యాంటీ ఎక్కువ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఫ్యామిలీ మొత్తం జగన్‌కు మద్ధతుగా నిలిచింది. జగన్ గెలుపు కోసం పనిచేశారు. కానీ నిదానంగా ఫ్యామిలీని జగన్ దూరం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

మొదట వైఎస్ వివేకా కేసులో జగన్ వైఖరి సరిగ్గా లేదని చెప్పి నెగిటివ్ వస్తుంది. సునీతాకు న్యాయం చేయడం లేదని, అటు షర్మిల ఏమో ఏపీ వదిలి తెలంగాణకు వెళ్ళి రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఇక తల్లి విజయమ్మ సైతం…షర్మిలకు మద్ధతుగా వెళ్లారు. అయితే జగన్ కావాలని ఫ్యామిలీని దూరం పెట్టారని టీడీపీ విమర్శలు చేస్తుంది. దీని వల్ల వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

అదే సమయంలో తాజాగా షర్మిల భర్త..బ్రదర్ అనిల్ కుమార్ ఏపీ ప్రభుత్వంని ఉద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ స్వార్థం కోసం ప్రభుత్వమిచ్చే పథకాల కోసం ప్రజలు ఆధారపడవద్దని కామెంట్ చేశారు. ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో పుట్టినా బాగుండేది అనే భావన ప్రజల్లో వచ్చిందని చెప్పుకొచ్చారు. అంటే జగన్ పేరు తీయలేదు గాని..పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించే అన్నారు.

అది కూడా విశాఖకు వచ్చి క్రిస్మస్ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని అనిల్ ఈ కామెంట్లు చేశారు. అంటే జగన్ పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పరోక్షంగా మాట్లాడారని చెప్పవచ్చు. అయితే ఇలా పరోక్షంగా మాట్లాడిన మాటలు సైతం జగన్‌కు వ్యతిరేకతని పెంచుతాయని చెప్పవచ్చు.
