టీడీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే దిశగా ముందుకు తీసుకెళుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ కోసం లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. జనవరి 27 నుంచి పాదయాత్ర చేయడానికి లోకేష్ సిద్ధమయ్యారు. కుప్పం టూ ఇచ్చాపురం 4 వేల కిలోమీటర్లు, 400 రోజులు పాదయాత్ర చేయడానికి ఫిక్స్ అయ్యారు.

పాదయాత్రలో ప్రధానంగా యువత ఓట్లని టార్గెట్ చేసుకుని లోకేష్ ముందుకెళ్తారని తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో యువత ఓట్లు ఎక్కువగా వైసీపీకి పడ్డాయి..ఆ తర్వాత జనసేనకు పడ్డాయి. టీడీపీకి తక్కువగానే యువత మద్ధతు తెలిపారు. కానీ ఈ సారి యువత జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు..ఇక వారిని తమవైపుకు తిప్పుకోవడానికి లోకేష్ చూస్తున్నారు. అటు పవన్‌కు యూత్‌లో క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ సమయంలో లోకేష్ సరికొత్త ఆలోచనలతో రాజకీయం చేయడానికి రెడీ అయ్యారు.

ఇదే తరుణంలో కేజిఎఫ్ హీరో యష్‌ని లోకేష్ కలవడం ఆసక్తికరంగా మారింది. మొదట నుంచి వారికి పెద్ద పరిచయాలు లేవు. కానీ తాజాగా కర్నాటకలో వారిద్దరు కలవడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అయితే వారి కలవడం గురించి పెద్ద విశేషమేమి లేదని తెలుస్తోంది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వారిద్దరు కలిశారని తెలిసింది. కాకపోతే దాదాపు వారు అరగంట సేపు మాట్లాడుకున్నారు.

అలా అని వారు రాజకీయంగా మాట్లాడుకునే అవకాశాలు పెద్దగా లేవు. యష్‌కు పోలిటికల్ బ్యాగ్రౌండ్ లేదు. కాకపోతే గత కర్నాటక పార్లమెంట్ ఎన్నికల్లో సుమలతకు మద్ధతుగా యష్ ప్రచారం చేశారు. అయితే కర్నాటకతో పాటు ఏపీలో కూడా యష్‌కు బాగా ఫాలోయింగ్ ఉంది..యూత్ లో క్రేజ్ ఉంది. ఈ క్రమంలో లోకేష్-యష్ కలవడం..కాస్త లోకేష్‌కు యూత్ మద్ధతు పెరిగే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.
