గుడివాడలో కొడాలి నానిని ఓడించే మంచి అవకాశం టీడీపీకి దొరుకుతుందనే ప్రతిసారి…అక్కడ ఏదొక కన్ఫ్యూజన్ వస్తూనే ఉంటుంది. సీటు కోసం పోటీపడే నాయకులు పెరిగిపోతారు. దీంతో గుడివాడ టీడీపీలో కన్ఫ్యూజన్ వస్తుంది. ఏదేమైనా గాని ఎన్ని సార్లు త్యాగం చేసిన మళ్ళీ గుడివాడలో పార్టీని బలోపేతం చేసే దిశగా రావి వెంకటేశ్వరరావు కష్టపడుతున్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు..ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇక టీడీపీ క్యాడర్ని కలుపుకుని వెళుతున్నారు. క్యాడర్ కూడా రావికి క్లోజ్ అయ్యారు.

దీంతో రావికే గుడివాడ సీటు ఫిక్స్ అవుతుందనుకునే తరుణంలో అక్కడ కొందరు నేతలు సీటు విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే పిన్నమనేని బాబ్జీ, శిష్ట్లా లోహిత్ లాంటి వారు రావికి పోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో ఇప్పుడు ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము గుడివాడకు వచ్చారు. ఆర్ధికంగా బలంగా ఉన్న ఈయన..గుడివాడ సీటు కోసం ట్రై చేస్తున్నారని ప్రచారం మొదలైంది.

ఇప్పటికే ఈయన..చంద్రబాబుని కూడా కలిశారని, ఇంకా గుడివాడలో యాక్టివ్ గా పనిచేస్తారని టాక్ నడుస్తోంది. సంక్రాంతి నుంచి రాము..నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేయడానికి రెడీ అవుతున్నారు. ఆయనకంటూ సొంత వర్గాన్ని రెడీ చేస్తున్నారు. పైగా ఈయన భార్య ఎస్సీ వర్గం కావడంతో..ఆ వర్గం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారట.

అంటే రావికి పోటీగా రాము కూడా టీడీపీలో పనిచేయనున్నారు. ఇలా పోటాపోటిగా పనిచేయడం వల్ల టీడీపీ క్యాడర్ రెండుగా చీలుతుంది..అలాగే కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి చంద్రబాబు ముందే ఈ సీటు గురించి తేల్చేస్తే బెటర్..అలా కాకుండా చివరి వరకు వచ్చి మళ్ళీ క్యాండిడేట్ని మార్చడం వల్ల ఉపయోగం ఉండదు. గత ఎన్నికల్లో అలాగే రావిని తప్పించి దేవినేని అవినాష్‌ని నిలబెట్టారు. ఆయన ఓడిపోయాక వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో మళ్ళీ రావి దిక్కు అయ్యారు. కాబట్టి ఈసారి ముందుగానే అభ్యర్ధిని ఫిక్స్ చేస్తే బెటర్. లేదంటే గుడివాడలో మళ్ళీ టీడీపీకి డౌటే.

