అధికార వైసీపీలో రోజురోజుకూ అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. సొంత పార్టీపైనే విమర్శలు చేసే నాయకుల సంఖ్య పెరుగుతుంది. తమ ప్రభుత్వం కేవలం సంక్షేమాన్ని పట్టించుకుని మిగిలిన వాటిని వదిలేసిందని, దీని వల్ల ప్రజలని ఓట్లు అడిగే పరిస్తితి లేదని అంటున్నారు. పెన్షన్లు, పథకాలతో డబ్బులు ఇస్తే సరిపోదు అని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధి చేయాలని అంటున్నారు.

ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా వైసీపీకి పెద్ద డ్యామేజ్ చేస్తుంది. సీటు కోసం నేతలు ఒకరినొకరు చెక్ పెట్టుకునే పరిస్తితి. దీని వల్ల వైసీపీకి నష్టం జరిగే పరిస్తితి. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు..పరోక్షంగా తమ ప్రభుత్వం పనితీరుపైనే విమర్శలు చేస్తున్నారు. సీఎం బటన్ నొక్కుతున్నారు..వాలంటీర్లు పథకాలు ఎవరికి రావాలో చెబుతున్నారు. ఇంకా ఎమ్మెల్యేలు చేయడానికి ఏముందని, అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వట్లేదనే అసంతృప్తి వారిలో ఉంది.

ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..అధికారుల తీరుపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. వరదల వల్ల నష్టపోయినా సరే..ఆదుకోవడం లేదని అంటున్నారు. అటు టీచర్లు తమ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. ఇక వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి..సంచలన వ్యాఖ్యలు చేశారు.


రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కొత్త ప్రాజెక్టులు కట్టలేదని, తాగునీరు సరిగ్గా ఇవ్వలేకపోతున్నామని ఇంకా ప్రజలని ఏమని ఓట్లు అడుగుతామని అంటున్నారు. పెన్షన్లు ఇస్తే సరిపోతుందా? గత ప్రభుత్వాలు కూడా ఇచ్చాయని అంటున్నారు. ఏం చేయకుండా ఓట్లు ఎలా అడగలమని అంటున్నారు. ఇలా వైసీపీలో ఎక్కడకక్కడ అసంతృప్తి గళం వినపడుతుంది. దీని వల్ల భవిష్యత్‌లో వైసీపీకి నష్టం జరిగేలా ఉంది.

Leave feedback about this